వేములవాడ లో నకిలీ మద్యం కేసు..బ్రాండెడ్ మద్యం పేరుతో చీప్ లిక్కర్‌ను విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ముఠాను వేములవాడ ఎక్సైజ్ పోలీసులు గుర్తించి, ఇద్దరు సభ్యులను అరెస్ట్ చేశారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎక్సైజ్ సీఐ రాజశేఖర్ రావు ఈ వివరాలను వెల్లడించారు.

వేములవాడ లో నకిలీ మద్యం ఎలా జరిగింది ఈ మద్యం మోసం..?
వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన తునికి కార్తీక్ అనే యువకుడు, ఖాళీ బ్రాండెడ్ మద్యం సీసాలను (Black & White, William’s Sons, Black Dog, Red Label, Signature) సేకరించి, వాటిలో తక్కువ నాణ్యత కలిగిన మద్యం (చీప్ లిక్కర్)ను నింపుతూ, ప్రజలకు నిజమైన బ్రాండెడ్ మద్యం అనే నమ్మకంతో విక్రయిస్తున్నాడు.
వేములవాడ లో నకిలీ మద్యం ఎలా పట్టుకున్నారు?
నమ్మదగిన సమాచారం ఆధారంగా మంగళవారం సాయంత్రం ఎక్సైజ్ పోలీసులు కార్తీక్ ఇంటిపై తనిఖీ చేశారు. ఖాళీ నీళ్ళ సీసాలలో నింపిన మద్యం, అలాగే బ్రాండెడ్ బాటిళ్ళలో నకిలీ మద్యం ఉన్నట్లు గుర్తించారు. కార్తీక్ ను విచారించగా, ఈ ముఠాలో వేములవాడ పట్టణానికి చెందిన దామరపల్లి సంతోష్ అనే మరో యువకుడి కూడా భాగస్వామిగా ఉన్నట్లు తెలిసింది.
ప్రజలకు ఎక్సైజ్ శాఖ సూచన
- తక్కువ ధరకే ఎక్కువ మద్యం అందించడమంటే మోసం అనుకోవాలి
- నమ్మదగిన మద్యం దుకాణాల నుంచే కొనాలి
- ఏదైనా అనుమానాస్పదంగా అనిపించిన సమాచారం వెంటనే స్థానిక ఎక్సైజ్ అధికారులకు తెలియజేయాలి.
Read More: Read Today’s E-paper News in Telugu