Telanganapatrika (August 2): Srushti Test Tube Center Case, పేదల అవసరాలను మాయగా మార్చి ట్రాప్ చేసే వ్యవస్థ సృష్టి కేసులో బయటపడింది. పోలీసులు తెలిపిన తాజా వివరాల ప్రకారం, ఈ చైల్డ్ ట్రాఫికింగ్ కేసు గమ్యం, గంభీరత మరింత భయంకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Srushti Test Tube Center Case పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం:
కళ్యాణి, సంతోషి అనే ఇద్దరు మహిళలు ముఖ్యంగా వ్యవహరించారని
గ్రామీణ ప్రాంతాల్లో క్యాంపులు పెట్టి, డబ్బు ఆశ చూపించి పేద పిల్లలను కోనుగోలు చేసినట్లు సమాచారం.
విశాఖ – విజయవాడ కేంద్రాలుగా..?
అధికారుల ప్రకారం:
విశాఖపట్నం, విజయవాడ, ఈ రెండు ప్రాంతాలను పిల్లల డెలివరీ హబ్‌లుగా ఉపయోగించినట్లు వెల్లడించారు. అక్కడి నుంచి పిల్లలను తీసుకురావడమే కాకుండా, ఇతర రాష్ట్రాలకు తరలింపు కూడా జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పూర్తి వివరాలు వచ్చే వారం విడుదల..
పోలీసులు ఇంకా శోధనలో ఉన్నారని, పూర్తి వివరాలను వచ్చే వారం అధికారికంగా వెల్లడిస్తామని వెల్లడించారు. కేసులో మరిన్ని అరెస్టులు, ముఠా లింకులు బయటపడే అవకాశం ఉంది.
Read More: Read Today’s E-paper News in Telugu