Telanganapatrika (July 31): RTC బస్సుకు నిప్పు , మిర్యాలగూడ మండల పరిధిలోని తడకమళ్ళ గ్రామంలో జూలై 23 తేదీన సుమారు రాత్రి మూడు గంటల సమయంలో గ్రామ సెంటర్లోని ఎంపీపీఎస్ పాఠశాల ముందు పార్కు చేసి ఉన్న మిర్యాలగూడ డిపోకు చెందిన టీజీ 05 జెడ్ 0047 ఆర్టీసీ బస్సు ని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టినారు .

RTC బస్సుకు నిప్పు – ఎవరు చేశారు..?
అనే విషయంలో ఆర్టీసీ బస్ కండక్టర్ బాలకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా తడకమళ్ళ గ్రామస్తుడు అయిన కుసుమ సుదర్శన్ రెడ్డి(42) అను వ్యక్తి తాను తన గ్రామ శివారులోని పొలం పక్కనే గల సబ్ స్టేషన్ యొక్క భూమిని ఆక్రమించిన విషయమై గ్రామస్తులు అందరికీ తెలిసి దాని గురించే చర్చించుకుంటున్నారని, ఏవిదంగా అయిన దానిని దృష్టి మరలచాలని ఉద్దేశంతో, తన గ్రామస్తుడు సహచరుడైన తంగేళ్ల జానకి రెడ్డి (30) అను అతనితో కలిసి, పథకం ప్రకారం 2025 జూలై 23 తేదీన అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఇద్దరు కలిసి ఒక క్యాన్ లో కొంత డీజిల్ ను సుదర్శన్ రెడ్డి ఇంటి నుండి తీసుకొని ఒక కాగడాను తయారు చేసుకుని గ్రామ సెంటర్లో పార్కింగ్ చేసి ఉన్న ఆర్టీసీ బస్సు వద్దకి వెళ్లి బస్సు కుడి వైపున డ్రైవర్ సీటు వద్ద నుండి లోపలికి ప్రవేశించి లోపల డీజిల్ ని చల్లి కాగడాతో అంటించి తగలబెట్టినారు తదుపరి ఎవరికీ అనుమానం రాకుండా గ్రామం నుండి ఎటో వెళ్ళి జూలై 31 గురువారం నాడు వారు ఇంటికి వస్తుండగా తడకమళ్ళ గ్రామ శివారులోని సబ్ స్టేషన్ వద్ద పట్టుబడి చేసి వారిని ప్రశ్నించగా, వారు చేసిన నేరాన్ని అంగీకరించిగా పంచుల సమక్షం లో ఒప్పుకోలు పంచనామా నిర్వహించి వాదరి వద్ద నుండి వారు నేరం చేసిన రోజు ధరించిన బట్టలను, ఒక లైటర్ ను , వారి ఇద్దరి సెల్ ఫోన్ లను స్వాధీన పరుచుకోనైనది.నిందితుడైన కుసుమ సుదర్శన్ రెడ్డి గతంలో వివిధ సెక్షన్లపై (8) కేసులు కలవు.2 వ నిందితుడు తంగేళ్ల జానకి రెడ్డి పై (5) కేసులు కలవు.
ఉన్నతాధికారుల సూచనల మేరకు పై ఇద్దరు నేరస్తులపైన రౌడీషీట్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా మిర్యాలగూడ, ఇతర ప్రాంతాల్లో ఎవరైనా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడము ఆక్రమించుకోవడం ల్యాండ్ గ్రాంబింగ్ చేసుకోవడానికి ప్రయత్నించడం లాంటి చర్యలకు పాల్పడినట్లైతే ఎంతటి వారినైనా వారి పైన కఠినమైన చర్యలు తీసుకొనబడును, బాధితులు ఎవరైనా ఇటువంటి వారితో బాధింపబడి ఉంటే నిర్భయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయగలరు.రూరల్ ఎస్సై లక్ష్మయ్య వివరాలు తెలిపారు.
Read More: Read Today’s E-paper News in Telugu