Telanganapatrika (July 31): SP Sharat Chandra Pawar , జిల్లా క్లూస్ టీమ్ కి కేటాయించిన నూతన మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రారంభించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.

SP Sharat Chandra Pawar టెక్నాలజీలో ముందడుగు..
అనంతరం వారు మాట్లాడుతూ ఇక నుంచి నేరం జరిగిన ప్రదేశానికి క్లూస్ టీం త్వరితగతిన చేరుకొని,నేర నమూనాలను సేకరించుటకు నూతన సాంకేతిక టెక్నాలజీతో డి.ఎన్.ఎ.శాంపిల్ కలెక్షన్ కిట్, రక్త నమూనా , సేమన్ కలెక్షన్ కిట్, నార్కోటిక్ డిటెక్షన్ కిట్, పేలుడు పదార్థాల డిటెక్షన్ కిట్, ఎల్.ఈ.డీ. సెర్చ్ లైట్, గ్యాస్ డిటెక్టర్, నేర ఆధారాలను భద్ర పరచి ఫోరెన్సిక్ సేఫ్ డ్రాయింగ్ క్యాబినెట్ లాంటి అన్ని సదుపాయాలు ఈ వాహనంలో కలిగి ఉంటాయని అన్నారు.
ఎప్పుడైన హ*త్యలు,మానభంగాలు, అనుమానస్పద మ*రణాలు, మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, దొంగతనాలు జరిగినప్పుడు ఈ పరికరాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ నేర దర్యాప్తు విషయంలో కచ్చితమైన ఫలితాలు సాధించవచ్చునని తెలిపారు.అన్ని సదుపాయాలు ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనం లో ఉండడం వలన నేర పరిశోధన సులభతరం అవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్ ఏ.ఆర్ డీఎస్పీ శ్రీనివాసులు డిసిఆర్బి సీఐ శ్రీను నాయక్,ఆర్.ఐ లు సూరప్ప నాయుడు,సంతోష్,నరసింహ క్లూస్ టీమ్ ఇంచార్జి ఎస్.ఐ శివ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu