Telanganapatrika (July 30): ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం , రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని.. ఎవరూ ఆందోళన చెందవద్దని అర్హులందరికీ కార్డులు అందిస్తామని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. బుధవారం చొప్పదండిలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాలులో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం లో కలెక్టర్ చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లిసత్యం తోకలసి హాజరు ఐయ్యారు .

ఈ. సందర్బంగా కలెక్టర్ , ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ …
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకునేందుకు రేషన్ కార్డు కీలకమన్నారు. జిల్లావ్యాప్తంగా 78 వేలకు పైగా నూతన రేషన్ కార్డులు, చొప్పదండి నియోజకవర్గం నాలుగు వేల కార్డులను అందిస్తున్నామని ఉన్నారు. రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిరుపేదలకు సన్న బియ్యం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు అందిస్తుందని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఒక్కరికి కూడా రేషన్ కార్డులను ఇవ్వలేదన్నారు. ఈ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుందన్నారు. నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18 నెలల కాలంలో 60,000 ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిందన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు 10 లక్షల బీమా చేస్తుందన్నారు. త్వరలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ రాబోతుందని.. గంగాధర లో డిగ్రీ కాలేజ్, రామడుగులో అడ్వాన్స్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే పంట కల్లా గ్రావిటీ కాల్వల పనులు పూర్తి చేసి.. నియోజకవర్గాన్ని కోనసీమ మాదిరి తీర్చిదిద్దుతామన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తామని.. తర్వాత పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని వివరించారు. కార్యాలయానికే పరిమితం కాకుండా నిరంతరం స్కూళ్లు, హాస్టళ్ళు, అంగన్వాడి కేంద్రాలను సందర్శిస్తూ.. విద్యార్థులకు ఇబ్బంది రాకుండా చూస్తున్నందుకు కలెక్టర్ ను అభినందించారు.
అనంతరం లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, పలువురికి కల్యాణ లక్ష్మి చెక్కులు అందించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నవీన్, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu