Telanganapatrika (July 28): Gangadhara Tahsildar Corruption 2025 – గంగాధర తహశీల్దార్‌పై ప్రజలు లంచం డిమాండ్లకు సంబంధించిన ఫిర్యాదులు చేసారు.

Gangadhara Tahsildar Corruption 2025.
- గంగాధర తహశీల్దార్ పై ప్రజావాణిలో ఫిర్యాదులు
- మండలంలోని పలువురి భూ సమస్యల పరిష్కారంపై లంచం డిమాండ్
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ఆచంపల్లి, గట్టుబూత్కూర్, గ్రామాలకు చెందిన గ్రామస్తులు మండల రెవెన్యూ అధికారి అనుపమ రావు పై సోమవారం ప్రజావాణి లో బాధితులు పిర్యాదు చేసారు. వివరాల్లోకి వెళ్తే
గంగాధర మండలం ఆచంపల్లి గ్రామానికి చెందిన రేగుల భూమయ్య తండ్రి ఎల్లయ్య, లకు ఆచంపల్లి రెవెన్యూ శివారులోని సర్వే నంబరు 316/సి లో విస్తీర్ణం ఎ. 1-02 1/2 గుంటల భూమికి గాను ఎ. 1-001/2 గుంటల భూమి మాత్రమే ఆన్లైన్లో నమోదు అయింది. మిగతా రెండు గుంటల భూమి వేరే వ్యక్తి పేరు మీద నివాస స్థలాల కింద ఆన్లైన్లో చూపిస్తుంది అని ఈ విషయంపై రేగుల భూమయ్య మండలంలోని తహసిల్దార్ అనుపమ రావు కి ఫిర్యాదు చేయగాఆన్లైన్లో పేరు మార్పిడికి లక్ష రూపాయల లంచం డిమాండ్ చేసిందని బాధితుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు. అలాగే
గట్టుబుత్కూర్ గ్రామానికి చెందిన అముదగొని ఎల్లమ్మ కి గట్టుబుత్కూర్ రెవెన్యు శివారులోని సర్వే నెంబర్ 694ఎ లో విస్తీర్ణం ఎ.0-0900 గుంటల భూమి విరాసత్ గూర్చి మండల రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా కార్యాలం నుండి ఎవరు స్పందించక పోవడంతో తహసిల్దార్ సమస్య గురించి ప్రశ్నించగా 20 వేల రూపాయల డిమాండ్ చేసిందని అముడగొని ఎల్లమ్మ ప్రజావాణి లో పిర్యాదు చేసినట్టు తెలిపారు.
అదే గ్రామానికి చెందిన మారాజు లక్ష్మి కొనుగోలు చేసిన భూమి సర్వే నెంబర్ 1167బి/1/2 విస్తీర్ణం ఎ0-0060 గుంటల భూమి రిజిస్ట్రేషన్ కొరకు స్లాట్ బుక్ చేసుకొని మరుసటి రోజు రిజిస్ట్రేషన్ కొరకు వెళ్తే తహసిల్దార్ 50 వేల రుపాయలు లంచంగా డిమాండ్ చేసారు అని ప్రజావాణి లో పిర్యాదు చేసినట్టు తెలిపినారు.
ఒంటెల భాస్కర్ రెడ్డి, వారి కుంటుంబ సభ్యులు వాటాలు పంచుకోలేదు అని తన సోదరుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చూస్తున్నాడు అని సర్వే నెంబర్ 519 లో విస్తీర్ణం ఎ 1-1000 గుంటల భూమి లో మేము ఇరువురం అన్న్ధములం భూమి పంచుకోలేదు ఇట్టి సర్వే నెంబర్ లో రిజిస్ట్రేషన్ లు చేయకూడదు అని పలు మార్లు తహసిల్దార్ కి పిర్యాదు చేసినప్పటికీ. మా సోదరుడి దగ్గర లంచం తీసుకొని రిజిస్ట్రేషన్ చేసిందని బాధితుడు ప్రజావాణి లో ఫీరియదు చేసినట్టు తెలిపారు.
ఇలాంటి అవినీతి అధికారుల పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
తహశీల్దార్, రెవెన్యూ శాఖల సమాచారాన్ని పొందడానికి మరియు ప్రజావాణి ఫిర్యాదుల వివరాలకు ఇది ప్రధాన వెబ్‌సైట్. https://ccla.telangana.gov.in
Read More: SWR Apprentice Recruitment 2025 – అప్రెంటిస్ పోస్టుల వివరాలు!
One Comment on “Gangadhara Tahsildar Corruption 2025: ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ!”