Telanganapatrika (July 27): Indiramma Canteens Hyderabad , హైదరాబాద్ నగర ప్రజలకు శుభవార్త! ఆగస్టు 15 నుండి GHMC ఆధ్వర్యంలో ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభమవుతున్నాయి. ఈ క్యాంటీన్ల ద్వారా అల్పాహారం రూ.5కే అందించనున్నారు. ప్రజలకు చౌక ధరలో పోషక ఆహారం అందించడమే ఈ స్కీం ఉద్దేశ్యం.

Indiramma Canteens Hyderabad పేదల ఆకలి తీరుస్తుందా ఈ కార్యక్రమం..?
అల్పాహారం మెనూలో ఇడ్లీ, ఉప్మా, పొంగల్, పూరి లాంటి పలు వంటకాలు ఉండనున్నాయి. వీటిని తృణధాన్యాలతో తయారు చేసి, ఆరోగ్యకరంగా వడ్డించనున్నారు.
ప్రతి టిఫిన్ ప్లేటు ఖర్చు ₹19 కాగా, వినియోగదారుడు కేవలం ₹5 మాత్రమే చెల్లిస్తాడు. మిగతా మొత్తాన్ని GHMC భరిస్తుంది.
ఈ క్యాంటీన్లు ఆదివారం మినహా ప్రతి రోజు పనిచేస్తాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నమూనా క్యాంటీన్లు సిద్ధంగా ఉన్నాయి. పూర్తి స్థాయిలో అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి.
ఈ స్కీం ద్వారా రోజుకి వందల మందికి చౌక ధరలో మంచి ఆహారం అందనుంది. హైదరాబాదులో ఈ యోజన పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
Read More: Read Today’s E-paper News in Telugu
One Comment on “Indiramma Canteens Hyderabad : రూ.5కే టిఫిన్.. ఆగస్టు 15న ప్రారంభం..!”