Telanganapatrika (July 26): School Mock Elections 2025 – కరీంనగర్ వేదం స్కూల్‌లో జరిగిన నమూనా ఎన్నికలు విద్యార్థుల్లో ప్రజాస్వామ్యం పట్ల అవగాహన కలిగించాయి.

School Mock Elections 2025.
కరీంనగర్.. వేదం ఉన్నత పాఠశాలలో నమూనా ఎన్నికలు స్థానిక రాంనగరంలోని వేదం ఉన్నత పాఠశాలలో నమూనా ఎన్నికలు చాలా ఘనంగా జరిగాయి.
ప్రతి సంవత్సరం వేదం ఉన్నత పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు ఈ ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఎన్నికలలో పాఠశాలలో హెడ్ బాయ్, హెడ్ గర్ల్, స్పోర్ట్స్ కమిటీ,యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేసి వాటికి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను ఈ నమూనా ఎన్నికల ద్వారా ఎన్ని కోవడం జరుగుతుంది. ఈ ఎన్నికలలో భాగంగా పాఠశాలలోని అందరి విద్యార్థిని విద్యార్థులకు ప్రజాస్వామ్యం పైన అవగాహన తీసుకురావడం కోసం మరియు ఎన్నికల నిర్వహణలో ఉపయోగించే బ్యాలెట్ పత్రము, బ్యాలెట్ బాక్స్ లు, సిరా మరకలు మరియు ఎన్నికలలో ఉపయోగించే స్వస్తిక్ గుర్తు గురించి పాఠశాల కరస్పాండెంట్ శ్రీ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ క్లుప్తంగా వివరించారు. విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఎడమచేతి చూపుడు వేలికి సిరా మరక పెట్టుకుని బ్యాలెట్ పత్రంలో స్వస్తిక్ గుర్తుతో ఓటు వేసి బ్యాలెట్ బాక్స్ లో వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు.
Election Commission of India – Electoral Literacy Clubs 👉 https://ecisveep.nic.in/educational-initiatives/electoral-literacy-club/
(విద్యార్థులకు ఎన్నికల అవగాహన పెంచే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం)
Read More: LAWCET 2025 Counselling: లాసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల.