Telanganapatrika (July 26) : Yadagirigutta Ticket Price Hike , యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సత్యదేవుడి వ్రత టికెట్ ధరను పెంచినట్టు అధికారికంగా ప్రకటించారు. గతంలో రూ.800గా ఉన్న ఈ టికెట్, శుక్రవారం నుంచి రూ.1000కి పెరిగింది.
ఈ పెంపుతో పాటు, భక్తులకు ప్రత్యేకంగా శెల్ల, కనుము మరియు స్వామివారి ప్రతిమలు అందజేస్తారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అనువంశిక ధర్మకర్త భాస్కరాయణి నరసింహమూర్తి గారు, దేవాదాయ శాఖ కమిషనర్, ఈవో వెంకట్రావు దంపతులు వ్రత టికెట్లు కొనుగోలు చేసి వ్రతాన్ని ఆచరించారు.

కొత్త ఏర్పాట్లు ఆలయంలో…
- కొత్తగా నిర్మించిన ప్రసాదాల టికెట్ కౌంటర్‌ను ప్రారంభించారు.
- భక్తుల క్యూలైన్లను శీఘ్రంగా, క్రమంగా నడిపించేందుకు సిబ్బందికి క్రౌడ్ మేనేజ్‌మెంట్ శిక్షణను విశ్లేషకుడు ప్రసన్నకుమార్ ఇచ్చారు.
Yadagirigutta Ticket Price Hike భక్తుల గమనిక:
ఈ టికెట్ ధర పెంపు భక్తులకు మరిన్ని ప్రసాదాలు, ప్రత్యేక సేవలు అందించేందుకు తీసుకున్న నిర్ణయమని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
మరిన్ని విశేషాలు: www.telanganapatrika.in