Telanganapatrika (July 24): సిరిసిల్లలో కేటీఆర్ పుట్టినరోజు, మాజీ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అత్యంత ఘనంగా జరుపుకున్నారు. బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముందుగా తెలంగాణ భవన్ లో కేటీఆర్ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. జిల్లా శాఖ అధ్యక్షులు తోట ఆగయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించారు.

గ్రాండ్‌గా సిరిసిల్లలో కేటీఆర్ పుట్టినరోజు సెలబ్రేషన్..!
అనంతరం సిరిసిల్ల గాంధీ చౌక్ లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత స్థానిక జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. తరువాత మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేగా మంత్రిగా కేటీఆర్ సిరిసిల్ల ప్రాంతానికి చేసిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. అభివృద్ధికి నమూనాగా నిలిచారన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య, రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు,అర్బన్ బ్యాంక్ చైర్మన్ రాపల్లి లక్ష్మీనారాయణ, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కళా చక్రపాణి, మాజీ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, సిస్ డైరెక్టర్ డి లక్ష్మీనారాయణ, మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, బొల్లి రామ్మోహన్, కోడి అంతయ్య, గజబిన్ కార్ రాజన్న, మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భార్యగా పాల్గొన్నారు.

సిరిసిల్లలో కేటీఆర్ పుట్టినరోజు అడుగడుగునా భారీగా వెలిసిన శుభాకాంక్షల కటౌట్లు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గురువారం గులాబీ శోభిత వర్ణమైంది. కేటీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా వాడవాడలా ప్రధాన రహదారులతో సహా కేటీఆర్ కటౌట్లతో నిండిపోయింది. గాంధీ చౌక్ చుట్టూరా కేటీఆర్ కటౌట్లే సర్వత్ర దర్శనమిచ్చాయి. ప్రధాన రహదారిపై అడుగడుగునా కటౌట్లు ఏర్పాటు చేశారు. ప్రతి వార్డు జంక్షన్లో కేటీఆర్ ఫ్లెక్సీలతో వీధులన్నీ నిండిపోయాయి. మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రధాన బాధ్యులు, నాయకులు ఫ్లెక్సీలు, కటౌట్ ల ద్వారా కేటీఆర్ పై ఉన్న తమ అభిమానాన్ని చాటుకున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
