Telanganapatrika (జూలై 22 ): TS TET Result 2025 తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ఫలితాలు నేడు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయని విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 18 నుండి 30వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షలో దాదాపు లక్షల సంఖ్యలో అభ్యర్థులు పాల్గొన్నారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా గారు అధికారికంగా ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలను tgtet.aptonline.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

పేపర్-1 & పేపర్-2 హాజరైన అభ్యర్థుల వివరాలు:
- పేపర్-1:
దరఖాస్తులు – 63,261
హాజరైనవారు – 47,224 - మాథ్స్ & సైన్స్:
దరఖాస్తులు – 66,686
హాజరైనవారు – 48,998 - సోషల్ స్టడీస్:
దరఖాస్తులు – 53,706
హాజరైనవారు – 41,207
TS TET Results 2025:
- అధికారిక వెబ్‌సైట్ https://tgtet.aptonline.in/tgtet/ ని ఓపెన్ చేయండి
- హోమ్‌పేజీలో “TS‑TET Result 2025” లింక్‌పై క్లిక్ చేయండి
- మీ జర్నల్ నెంబర్ లేదా హాల్ టికెట్ నెంబర్ & Date of Birth ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
గమనిక:
ఈ ఫలితాలు ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాలకు అర్హత పొందడానికి అవసరమైనవి. టెట్ ఉత్తీర్ణతతో DSC వంటి రిక్రూట్‌మెంట్లకు అర్హత ఉంటుంది.
ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయండి:
https://tgtet.aptonline.in/tgtet/
One Comment on “TS TET Result 2025: Telangana TET ఫలితాలు విడుదల – స్కోర్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి @tgtet.aptonline.in”