Telanganapatrika (July 22) : RRB NTPC Jobs 2025 Notification విడుదలైంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ద్వారా దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో NTPC (Non Technical Popular Categories) ఉద్యోగాల భర్తీకి 30,307 ఖాళీలకు సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉద్యోగార్థులకు ఇది మంచి అవకాశం.

మొత్తం ఖాళీలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30,307 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులు 5 విభాగాల్లో ఉన్నాయి:
- చీఫ్ కమర్షియల్ కం టికెట్ సూపర్వైజర్ – 6,235
- స్టేషన్ మాష్టర్ – 5,623
- గూడ్స్ ట్రైన్ మేనేజర్ – 3,562
- జూనియర్ ఎకౌంట్స్ అసిస్టెంట్ కం టైపిస్ట్ – 7,520
- సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్ – 7,367
దరఖాస్తు తేదీలు:
- ప్రారంభం: ఆగస్టు 30, 2025
- చివరి తేదీ: సెప్టెంబర్ 29, 2025
RRB NTPC Jobs 2025 Notification అర్హతలు:
- అభ్యర్థులు కనీసం ఇంటర్మీడియట్ (10+2) లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి (పోస్టు ఆధారంగా అర్హత మారుతుంది).
- అభ్యర్థుల వయసు 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయో పరిమితిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిలాక్సేషన్ అందుబాటులో ఉంటుంది..
ఎంపిక విధానం:
- CBT (Computer Based Test) ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
- CBT అనంతరం, పోస్టుల నుసారంగా టైపింగ్ పరీక్ష లేదా ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహించబడుతుంది.
- అర్హత సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
దరఖాస్తు విధానం:
- అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు ఫీజు & పూర్తి ప్రక్రియ అధికారిక పూర్తి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తెలియజేయబడుతుంది.
అధికారిక వెబ్‌సైట్‌లు:
- https://indianrailways.gov.in/
- సంబంధిత RRB జోన్ వెబ్సైట్లను చూడవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా వందలాది ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు తప్పక అప్లై చేయాలి.
Read More: Telangana Ration Card : జులై 25 నుంచి రేషన్ కార్డుల పంపిణీ – సీఎం కీలక ప్రకటన..!