Telanganapatrika (July 20): Vemulawada Rajanna , వేములవాడ శ్రీ రాజన్న ఆలయానికి వెళ్లే భక్తులకు శుభవార్త. ఇప్పటికే ఇరుకైన రోడ్లపై వచ్చే ఇబ్బందులు తొలగనున్నాయి. తర్వాత తరాలకు ఉపయోగపడే రాజమార్గ నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. వేములవాడ శ్రీ రాజన్న ఆలయం – కోడె కడితే కోరికలు తీరే దేవస్థానం అని ప్రజల నమ్మకం. ఈ పవిత్ర క్షేత్రానికి వెళ్లే ప్రధాన రహదారి ఇంతకాలం ఇరుకుగా ఉండడంతో భక్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Vemulawada Rajanna వేములవాడ ఆలయానికి రాజమార్గం – భక్తులకు ఊరట!
ఈ సమస్యను పరిష్కరించేందుకు RTC బస్టాండ్ నుండి ఆలయం వరకు 800 మీటర్ల పొడవు, 80 అడుగుల వెడల్పుతో “రాజమార్గం” నిర్మాణం చేపట్టబడింది. ఇది పూర్తయ్యే స్థితిలో ఉంది. ఈ విస్తరణ పనుల కోసం 243 ఇళ్లను తొలగిస్తున్నారు. అయితే, కొంతమంది కోర్టు స్టే తెచ్చుకోగా, వారి ఇళ్లను మినహాయించి మిగతా నిర్మాణాన్ని వేగంగా కొనసాగిస్తున్నారు.
ఈ రోడ్డుతో ఆలయ ప్రాంగణానికి బస్సులు, అంబులెన్స్‌లు, అత్యవసర సేవలు చేరడానికి వీలవుతుంది.
అదే కాకుండా, ఈ మార్గం పూర్తయిన తర్వాత వేములవాడ టూరిజంకు కూడా పెద్ద ఊతమవుతుంది.
Read More: Read Today’s E-paper News in Telugu