Telanganapatrika (జూలై 17) : Free SBI training 2025 , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (RSETI) ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ మహిళలకు ఉచిత శిక్షణ అందించేందుకు కీలక ప్రకటన వెలువడింది. ఈ శిక్షణ ప్రోగ్రాం కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలకు చెందిన మహిళల కోసం ప్రత్యేకంగా అమలు చేయనున్నారు.

Free SBI training 2025 శిక్షణ వివరాలు:
- శిక్షణ అంశం: జూట్ బ్యాగుల తయారీ
- తేదీ: జూలై 18 నుండి 14 రోజులపాటు
- సమయం: ప్రతి రోజు ఉదయం 9.30 నుండి సాయంత్రం 5.30 వరకు
- స్థలం: SBI – RSETI, తిమ్మాపూర్, కరీంనగర్ (శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కాలేజ్ ఎదురుగా)
అర్హతలు:
- వయస్సు: 19 నుండి 45 సంవత్సరాల మధ్య
- వివరాలు అందించాల్సిన పత్రాలు:
- పదో తరగతి మార్కుల మెమో జిరాక్స్
- ఆధార్ కార్డు జిరాక్స్
- రేషన్ కార్డు జిరాక్స్
- బ్యాంక్ పాస్ బుక్
- పాస్ పోర్ట్ సైజు ఫోటో
శిక్షణలో లభించే సదుపాయాలు:
- ఉచిత భోజనం
- ఉచిత వసతి
- నిపుణుల ద్వారా శిక్షణ
- ప్రభుత్వ ప్రామాణికత ఉన్న సర్టిఫికెట్
ఈ అవకాశాన్ని తెలంగాణాలోని యువతీ యువకులు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ శిక్షణ తర్వాత స్వయం ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఉత్సాహంగా పాల్గొనదలచినవారు వెంటనే RSETI కార్యాలయంలో సంప్రదించాలి.
Read More: Forest Guard Jobs 2025 – 10th, 12th అర్హతతో పర్మినెంట్ ఉద్యోగాలు!