Telanganapatrika (జూలై 16 ) : MPTC ZPTC Elections Telangana 2025 , రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థలైన ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికలను ఐదు విడతల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీరియస్‌గా ఆలోచన చేస్తోంది. వర్షాకాలం నేపథ్యంలో తగిన జాగ్రత్తలతో శాంతిభద్రతల నిర్వహణ, పోలింగ్ సిబ్బంది మోహరింపు, గిరిజన ప్రాంతాల్లో మెటీరియల్ తరలింపును దృష్టిలో ఉంచుకొని ఈ ప్రణాళికను సిద్ధం చేస్తోంది.

వర్షాకాలం వల్ల ఐదు విడతలు?
2019 ఎన్నికల్లో వేసవి కారణంగా మూడు దశల్లో నిర్వహించిన పోలింగ్‌ను, ఇప్పుడు వర్షాల కారణంగా ఐదు విడతల్లో నిర్వహించాలని కమిషన్ భావిస్తోంది. ఇప్పటికే ఓటరు జాబితాలు, పోలింగ్ స్టేషన్ల వివరాలు సిద్ధం చేసిన అధికారులు, ప్రభుత్వం రిజర్వేషన్ల సమాచారం ఇచ్చిన వెంటనే షెడ్యూల్ ఖరారు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
రెండు మూడు రోజుల గ్యాప్‌తో దశలవారీగా ఎన్నికలు
ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తవ్వడానికి 15 రోజులు అవసరమవుతుంది. 2019లో ఒక్కో దశకు నాలుగు రోజుల విరామం ఇచ్చారు. ఈసారి అయితే రెండు నుండి మూడు రోజుల గ్యాప్‌తోనే ఎన్నికలు నిర్వహించనున్నారు. పోలీస్ అధికారులతో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటారు.
ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ… తరువాత సర్పంచ్ ఎన్నికలు
ఈసారి ముందుగా ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ రెండు ఎన్నికలు ఒకే రోజున జరిగే అవకాశం ఉంది. అనంతరం గ్రామ సర్పంచ్ ఎన్నికలపై దృష్టి పెట్టనున్నారు. ఈ విధానం ద్వారా సిబ్బంది మోహరింపు సులభంగా జరిగి, పర్యవేక్షణ మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు.
MPTC ZPTC Elections Telangana 2025 నియోజకవర్గాల నిర్వహణకు ప్రత్యేక సన్నాహాలు
వర్షాల్లో రవాణా ఇబ్బందులు తలెత్తకుండా, ఓటింగ్ ప్రక్రియపై ఎలాంటి ప్రభావం లేకుండా చూసేందుకు కమిషన్ చర్యలు చేపడుతోంది. ప్రత్యేకించి గిరిజన ప్రాంతాల్లో బలమైన వ్యవస్థను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం
ఇలాంటి మరిన్ని రాజకీయ, ఎన్నికల విశేషాలకు తెలుగులో సంపూర్ణ కవరేజ్ కోసం www.Telanganapatrika.in సందర్శించండి.