Telanganapatrika (July 14): Financial support for women , ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలకు మహిళలకు విరివిగా బ్యాంకు రుణాలు అందించుట జరుగుతుందని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు (డి.ఆర్.డి.ఓ. ) సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం 2024-25 కు గాను రూ.223 కోట్ల లక్ష్యానికి గాను 2596 సంఘాలకు రూ.230 కోట్లు ప్రగతి (103.80%) సాధించినందుకు రాష్ట్రస్థాయిలో ములుగు జిల్లా పురస్కారం అందుకున్నదని తెలిపారు.

Financial support for women మహిళలకు ఆర్థిక స్వావలంబనకు బ్యాంకులు చేతికి చెయ్యిగా..
ఈ ఆర్ధిక సంవత్సరం అనగా 2025 -26 గాను రూ.222 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటివరకు 618 సంఘాలకు గాను రూ.54 కోట్ల 39 లక్షల ప్రగతి సాదించడం జరిగినదని, వ్యవసాయ పెట్టుబడితో పాటుగా ఇట్టి బ్యాంకు రుణాలతో మహిళలు వివిధ రకాల ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, చిన్న తరహా వ్యాపారాలు ఫ్యాన్సీ స్టోర్లు, కిరాణం, హోటల్, పిండి గిర్నీలు, చికెన్ షాపుల వంటి వ్యాపారాలకి పెట్టుబడులుగా
ఉన్న వ్యపారాలు పెంపొందించుకొడానికి ఉపయోగించుకోవడం జరుగుచున్నదని ఆయన తెలిపారు.
Read More: Read Today’s E-paper News in Telugu