Telanganapatrika (July 14): Medipalli Satyam Vemulawada Visit 2025, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Medipalli Satyam Vemulawada Visit 2025.
వేములవాడ రాజన్నను దర్శించుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సోమవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోకి ప్రవేశించిన ఎమ్మెల్యేకు దేవస్థానం అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వస్తి పఠిస్తూ స్వాగతం పలికారు.
స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించి, అద్దాల కళ్యాణ మండపంలో వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం ఆలయ ఈవో శ్రీమతి రాదాబాయి శేష వస్త్రం సమర్పించి, స్వామివారి ప్రసాదం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏఈఓలు బ్రహ్మన్న గారి శ్రీనివాస్, జి. అశోక్ కుమార్, ఆలయ పర్యవేక్షకులు జి. శ్రీనివాస్ శర్మ, ఇన్‌స్పెక్టర్ ఎం. రాజేందర్, ఇతర ఆలయ ఉద్యోగులు కూడా పాల్గొన్నారు.
మీరు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే — తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేదా ఇతర ప్రాంతాలు – www.telanganapatrika.in లో రాష్ట్రాలు, రాజకీయాలు, ఉద్యోగాలు, విద్య మరియు ప్రజా ప్రయోజనానికి సంబంధించిన విశ్లేషణాత్మక వార్తలు, విశ్వసనీయ సమాచారం మీకోసం అందుబాటులో ఉంటుంది.
తాజా వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను ప్రతిరోజూ సందర్శించండి.