Telanganapatrika (July 14) : Solar CCTV Camera Distribution 2025. వీణవంక ఎస్సైకి సోలార్ సీసీ కెమెరా అందజేసి ప్రజల రక్షణకు కృషి.

Solar CCTV Camera Distribution 2025.
- సీసీ కెమెరాలు ప్రజల పాలిట రక్షణ కవచాలు..
- వీణవంక ఎస్సై కి సోలార్ కెమెరా అందజేత..
- కాంగ్రెస్ నాయకులు మద్దుల ప్రశాంత్ పటేల్..
వీణవంక మండల పరిధిలోని లస్మక్కపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకులు మద్దుల ప్రశాంత్ పటేల్, వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి కోరిక మేరకు సోమవారం సోలార్ సీసీ కెమెరాను అందజేశారు. అనంతరం మద్దుల ప్రశాంత్ పటేల్ మాట్లాడుతూ.. నిఘా నేత్రాలు నేర పరిశోధనలో ప్రముఖ పాత్ర వహించని, గ్రామ గ్రామాన అనుకోని ప్రమాదాలు, రాత్రి సమయంలో దొంగతనాలు, కొట్లాటలు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయని, ప్రమాదాలను ఎప్పటికప్పుడు నివారించేందుకు, దొంగలను పట్టుకునేందుకు, నిఘా నేత్రాలు ప్రజలకు రక్షణ కవచాలుగా పనిచేస్తూ, ప్రముఖ పాత్ర వహిస్తాయని, పోలీసులకు నిఘా నేత్రాలు నేర పరిశోధనలో సహకరిస్తాయని, అప్పుడే బాధితులకు తక్షణ న్యాయం చేయకుతుందన్నారు. సోలార్ సీసీ కెమెరా ను అందజేసినందుకు మద్దుల ప్రశాంత్ పటేల్ కు, ఎస్సై ఆవుల తిరుపతి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దుల ప్రశాంత్ పటేల్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
మీరు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే — తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేదా ఇతర ప్రాంతాలు —తెలంగాణపత్రిక లో రాష్ట్రాలు, రాజకీయాలు, ఉద్యోగాలు, విద్య మరియు ప్రజా ప్రయోజనానికి సంబంధించిన విశ్లేషణాత్మక వార్తలు, విశ్వసనీయ సమాచారం మీకోసం అందుబాటులో ఉంటాయి. తాజా వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను ప్రతిరోజూ సందర్శించండి.