Telanganapatrika (July 13): Minister Vakiti Srihari , ఆత్మకూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎం.వి.రామన్ స్కూల్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని స్కూల్ అభివృద్ధిని ప్రశంసించారు.

విద్యకు నూతనదిశ Minister Vakiti Srihari చేతుల మీదుగా కొత్త స్కూల్ ప్రారంభం..
ఆయన మొదటగా స్కూల్‌లో ఏర్పాటు చేసిన లైబ్రెరీ, కంప్యూటర్ ల్యాబ్ లను సందర్శించి విద్యా వసతులను పరిశీలించారు. అనంతరం, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలలో భాగంగా నిర్వహించిన నృత్యాలు, గేయాలు వీక్షించి వారికి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాల అధినేత మోగిలి శ్రీధర్ గౌడ్ మంత్రి శ్రీహరిని ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో మండల నాయకులు, మున్సిపల్ ప్రతినిధులు, టీచర్లు, విద్యార్థులు, మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ పాఠశాల ప్రారంభం ద్వారా ఆత్మకూరు ప్రాంతంలోని విద్యార్థులకు ఆధునిక వసతులతో కూడిన విద్య అందుబాటులోకి రానుండడం గర్వకారణమని స్థానికులు అభిప్రాయపడ్డారు
Read More: Read Today’s E-paper News in Telugu