Telanganapatrika (July 12): New Police Station , రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో నూతన పోలీసు స్టేషన్ భావన నిర్మాణానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీతే తో కలిసి భూమి పూజ చేసారు.

New Police Station జిల్లా కలెక్టర్, ఎస్పీ నేతృత్వంలో భూమి పూజ కార్యక్రమం..
ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ ..మండల కేంద్రంలో రెండు ఎకరాలలో నూతన పోలీసు స్టేషన్ భవనం కోసం రెవెన్యూ శాఖ నుండి పోలీసు శాఖకు కేటాయించడం జరిగింది అని అన్నారు.జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న ప్రాంతం వీర్నపల్లి అని, ఈప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం యంత్రాంగం భాధ్యత అని అన్నారు.పేద ప్రజలకు న్యాయం చేకూర్చేలా పోలీసులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కోరారు.
ఎస్ పి మాట్లాడుతూ….
ఆధునిక సాంకేతికతను వినియోగించుకోని ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో పోలీసు శాఖ ముందంజలో ఉందన్నారు.పోలీసు వ్యవస్థలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మెరుగైన భద్రత వ్యవస్థను నెలకొల్పడం జరుగుతుందని,శాంతి భద్రతల ఎక్కడ అదుపులో ఉంటాయో అక్కడ అభివృద్ధి సాధ్యమని జిల్లా ఎస్పీ అన్నారు.
శాంతిభద్రతలను పర్యవేక్షించడంలో భాగస్వామ్యమై ప్రజలకు మరింత రక్షణగా ఉంటూ వీర్నపల్లి మండల ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో మండల కేంద్రంలో నూతన హంగులతో పోలీస్ స్టేషన్ భవనం కోసం రెవెన్యూశాఖ నుండి పోలీస్ శాఖకు కేటాయించిన స్థలంలో భూమి పూజ చేసుకోవడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో కె. కె మహేందర్ రెడ్డి, సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ లు లక్ష్మణ్,రమాకాంత్, ఎల్లగౌడ్, రాహుల్ రెడ్డి,ఏఎంసీ చైర్మెన్ రాములు నాయక్, సెస్ డైరెక్టర్ మల్లేశం,ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu