Telanganapatrika (July 12): Adilabad Blackmailing Racket, రౌడీ షీటర్ రోహిత్ షిండే, మహారాష్ట్ర యావత్ మాల్ కానిస్టేబుల్ నీడలో వాహనాల వద్ద బ్లాక్మెయిలింగ్ పాల్పడుతున్న ముఠా.
- 11 మందిపై కేసు నమోదు, నలుగురి అరెస్ట్, కీలక నిందితులు పరారీ, వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు.
- నెల నెల లక్షల్లో వసూలు, వాహన యజమానులను డబ్బు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరిస్తున్న ముఠా.
- భారీ కుంభకోణం బట్టబయలు చేసిన జిల్లా పోలీసు యంత్రాంగం.
- మహారాష్ట్ర పోలీసు కానిస్టేబుల్ సందీప్ కీలకంగా వ్యవహరిస్తూ ముఠా నాయకత్వం వహిస్తున్న వ్యక్తి.
- బాధితులు నిర్భయంగా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించాలి.
అరెస్టు చేసిన నిందితుల వివరాలు
1) చేతన్ సింగ్, నేరడిగొండ.
2) జంగిలి అన్వేష్, నేరడిగొండ.
3) మసీద్ ఆనంద్, ఇచ్చోడా.
4) మహమ్మద్ మజార్, ఆదిలాబాద్.
Adilabad Blackmailing Racket వివరాలలో
తెలంగాణ మహారాష్ట్ర రాష్ట్రాల గుండా కొనసాగే జాతీయ రహదారి 44 గుండా ప్రయాణించే అక్రమంగా తరలించే పశువుల వాహనాల వద్ద బ్లాక్మెయిలింగ్ దందాలకు పాల్పడుతూ లక్షల వసూలు చేస్తున్న భారీ కుంభకోణాన్ని జిల్లా పోలీసులు బట్టబయలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ వివరాలను తెలియజేస్తూ, నేరెడిగుండ పట్టణం నందు 11 మందిపై కేసు నమోదు చేసి, నలుగురిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసే రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు. వీరు ప్రధానంగా పశువుల అక్రమ రవాణాను ఆదిలాబాద్ గుండా రాష్ట్రాల మీదుగా తరలించేందుకు ముఠాగా ఏర్పడి వాహనాలను తనిఖీ చేస్తూ వాహన యజమానులు డ్రైవర్ల వద్ద బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేయడం, లేనియెడల వారిపై దాడులు పోలీసులకు ఫిర్యాదులు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారని తెలిపారు.

అక్రమ దందాను ముఠా సభ్యులు వ్యాపారంగా నిర్వహిస్తున్న విషయాన్ని తెలియజేశారు. ముఖ్యంగా ఈ ముఠా సభ్యులలో మహారాష్ట్ర యావత్ మాల్ జిల్లా కానిస్టేబుల్ సందీప్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తూ పశువుల అక్రమ రవాణాను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన రోహిత్ షిండే అనే రౌడీషీటర్ జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తూ పశువుల అక్రమ రవాణా చేస్తున్న వారిపై బెదిరింపులకు పాల్పడడం మరియు ఇదివరకే కుమ్మక్కైన అక్రమ రవాణా వారిని అడ్డుకోకుండా మామూళ్లను వసూలు చేస్తూ ఉన్న విషయాన్ని తెలియజేశారు. వీరికి సహకరించినటువంటి నలుగురు ముఠా సభ్యులను ఈరోజు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది అని తెలిపారు. ముఠా సభ్యుల వివరాలు నేరేడుగొండ కు సంబంధించిన చేతన్ కుమార్, అన్వేష్, పట్టణంలోని మజార్, ఆనంద్ మొత్తం 11 మంది పై నేరడిగొండ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చట్ట వ్యతిరేకంగా దందాలకు పాల్పడి బెదిరింపులకు పాల్పడిన వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. బాధితులు ఎవరైనా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని నిర్భయంగా సంప్రదించాలని వారికి తగిన న్యాయం చేస్తానని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఇచ్చోడా సీఐ బండారి రాజు, నేరేడిగొండ ఎస్సై ఇమ్రాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
👉 మీరు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే — తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేదా ఇతర ప్రాంతాలు — www.telanganapatrika.in లో రాష్ట్రాలు, రాజకీయాలు, ఉద్యోగాలు, విద్య, మరియు పబ్లిక్ ఇంటరెస్ట్ కు సంబంధించిన విశ్లేషణాత్మక వార్తలు అందుబాటులో ఉంటాయి.