Telanganapatrika (July 11): Garima Agrawal IAS, ప్రతి విద్యార్థికి నాణ్యమైన పోషకాహారం అందించడంలో ఏ మాత్రం తేడా వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, అంగన్వాడీలలో విద్యార్థులుకు అందించే గుడ్డు నాణ్యత పైన జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగ్రవాల్ ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

Garima Agrawal IAS పిల్లల ఆరోగ్యానికి గుడ్డు కీలకం..
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు అంగన్వాడి సెంటర్లలో పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో అత్యంత ముఖ్య ఆహార పదార్థం గుడ్డు అని ప్రతి విద్యార్థికి నాణ్యమైన పోషకాహారం అందించడం కోసమే ప్రభుత్వం పౌష్టికారంతోపాటు గుడ్డును విద్యార్థులకు అందజేస్తుందని అన్నారు. ప్రభుత్వం మార్గదర్శకాలు అనుగుణంగా నాణ్యమైన క్వాలిటీ మరియు క్వాంటిటీ గల కోడిగుడ్లనే ఉపయోగించాలని, ప్రభుత్వ ఆదేశాలమేరకు తరచుగా ఉన్నతాధికారులు హాస్టల్లోనూ, గురుకులాలను మరియు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంను పరిశీలించడం జరుగుతుందని… గుడ్డు నాణ్యతలో కానీ బరువులో గాని తేడా ఉంటే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాసరెడ్డి, డిబిసిడిఓ నాగరాజమ్మ, డీఎస్సీడిఓ కవిత, వివిధ గురుకురాల డిసిఒలు తదితరులు పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
