Telanganapatrika (July 11) : Telangana 42% BC Reservation Ordinance Approved, తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) అభ్యర్థులకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు రాష్ట్ర కేబినెట్ కీలకంగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2018లో ఆమోదించిన చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేయనుంది.
Telangana 42% BC Reservation Ordinance Approved

ఈ ఆర్డినెన్స్ ద్వారా, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు హక్కుతో కూడిన ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం చట్టబద్ధమైన మార్గం ఎంచుకుంటున్నట్లు ఆదాయ శాఖ మంత్రి పి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా ఇచ్చిన బీసీ రిజర్వేషన్ అంశంపై నిబద్ధతతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదన్నారు.
ఇప్పటికే 2018లో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లు కేంద్రానికి పంపించగా, రాష్ట్రపతి ఆమోదం రాకపోవడంతో ఆ బిల్లు అమలుకు నోచుకోలేదు. తాజాగా హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలు 3 నెలల్లో నిర్వహించాలంటూ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం తిరిగి ఈ చర్యలు చేపట్టింది.
కేబినెట్ సమావేశంలో అడ్వకేట్ జనరల్‌ను ఆహ్వానించి ఆర్డినెన్స్‌పై లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. అదే సమయంలో రాష్ట్రంలోని రెండు విద్యాసంస్థలకు యూనివర్శిటీ హోదా కల్పించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని వివరించారు.
www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!