Telanganapatrika (July 10): నిజామాబాద్ అగ్నిప్రమాదం, నిజామాబాద్ నగరంలోని అర్సపల్లిలోని బోధన్ రోడ్డులో ఉన్న స్క్రాప్ ఇండస్ట్రీ ఏరియాలో గురువారం ఉదయం 5 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు తీవ్రంగా అలముకోవడంతో పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా దట్టమైన పొగ వ్యాపించింది.

నిజామాబాద్ అగ్నిప్రమాదం కనిపించిన మంటలు… కనుమరుగైన ఆస్తి..
స్థానికులు వెంటనే అప్రమత్తమై ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ ఇంజిన్ సిబ్బంది తక్షణమే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
జిల్లా ఫైర్ ఆఫీసర్ పరమేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ అగ్నిప్రమాదంలో దాదాపు రూ. 10 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఆపరేషన్‌లో ఫైర్ ఆఫీసర్ శంకర్ తో పాటు సిబ్బంది పాల్గొని మంటలను పూర్తిగా అదుపు చేశారని పేర్కొన్నారు.
అగ్నిప్రమాదానికి గల నిజమైన కారణంపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu