Telanganapatrika (July 10): రాజన్న సిరిసిల్లలో అక్రమ వడ్డీ , జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా అక్రమంగా వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారిపై పోలీసులు భారీ దాడులు నిర్వహించారు. ఉదయం 20 పోలీస్ బృందాలు కలసి ఒక్కసారిగా ఆకస్మిక తనిఖీలు జరిపాయి.

ఈ దాడుల్లో మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారు నిర్వహించిన అక్రమ ఫైనాన్స్ నుండి సుమారు ₹60 లక్షల విలువ గల డాక్యుమెంట్లు, తాకట్టు పెట్టిన వాహనాలు (4 బైక్స్, 1 ఆటో) స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ వడ్డీ వ్యాపారులపై రాజన్న సిరిసిల్లలో పోలీసుల ఉక్కుపాదం…
SP మహేష్ బి. గీతే హెచ్చరికలు:
“సామాన్యుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని అధిక వడ్డీ వసూలు చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు. RBI నియమాలు, మనిలెండింగ్ చట్ట నిబంధనలు పాటించని ఫైనాన్స్ దారులపై కేసులు నమోదు చేస్తాం,” అని ఎస్పీ తెలిపారు.
అలాగే ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో అక్రమ ఫైనాన్స్ దారులను ఆశ్రయించవద్దని, ప్రభుత్వ అనుమతి ఉన్న సంస్థల నుంచే అప్పులు తీసుకోవాలని సూచించారు. ఎవరికైనా సమాచారం ఉంటే, గోప్యంగా పోలీసులకు తెలియజేయవచ్చని చెప్పారు.
అదుపులోకి తీసుకున్న వారు (పూర్తి జాబితా):
- నల్ల ప్రదీప్ – గాంధీనగర్, సిరిసిల్ల
- దూస శ్రీనివాస్ – నెహ్రూనగర్, సిరిసిల్ల
- డుబాల మొండయ్య – నెహ్రూనగర్, సిరిసిల్ల
- ఉషకోయిల మనోహర్ – నెహ్రూనగర్, సిరిసిల్ల
- అనగండుల శ్రీహరి – శివానగర్, సిరిసిల్ల
- వోడ్నాల అంజనేయులు – నెహ్రూ విగ్రహం సమీపం, ఎల్లారెడ్డిపేట
- మాడి శెట్టి పురుషోత్తం – బోయినపల్లి
- గోర్ల రాములు – తల్లలపల్లి, ఎలంతకుంట
- బొందుగుల జగదీశ్వర్ – మల్లారెడ్డిపేట, గంభీరావుపేట
- దండవేని అశోక్ – గంభీరావుపేట
Read More: Read Today’s E-paper News in Telugu