Telanganapatrika (July 10): Nursing Stipend Issue 2025, నర్సింగ్ కాలేజీలో చాలా రోజులుగా ప్రభుత్వం స్టైఫండ్ రిలీజ్ చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మిస్ బిల్లు చెల్లించకపోతే బయటకు వెళ్లిపోవాలని ప్రిన్సిపాల్ బెదిరించడం దారుణమని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ ఆరోపించారు. సిరిసిల్లలో గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో హరీష్ మాట్లాడుతూ తెలంగాణ నలుమూలల నుండి పేద బలహీన దళిత వర్గాల అమ్మాయిలు నర్సింగ్ కోర్సులు చేస్తుంటే ప్రభుత్వం స్ట్రైఫండ్ రిలీజ్ చేయకుండా చదువు కు దూరం చేస్తున్నారని విమర్శించారు.

Nursing Stipend Issue 2025
బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో పేద విద్యార్థులకు వైద్య విద్య చేరువలో ఉండాలని జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ పక్క భవనాలతో నిర్మించి సిబ్బందిని రిక్రూట్ చేసి స్టైఫండ్ను సైతం గతంతో కంటే రెట్టింపు చేసి విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం తిండి పెట్టలేని పరిస్థితికి తీసుకొచ్చారని విద్యావ్యవస్థ పై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ విద్యను డివిజన్ చేస్తూ ప్రైవేట్ విద్యా సంస్థలకు పెద్ద పీట వేస్తున్నారని పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్రకు తెర లేపారని ఆరోపించారు. నర్సింగ్ కళాశాల విద్యార్థులు హాస్టల్ లోనే ఉండి చదువుకునే వాళ్ళ హక్కును ప్రభుత్వం కాలరాస్తుంటే తాము చూస్తూ ఊరుకోమని వెంటనే స్టైఫండ్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నర్సింగ్ కళాశాల విద్యార్థులతో కలిసి ఆయా కార్యాలయ కాలేజీల ముందు విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేస్తామని బిఆర్.ఎస్.వి పక్షాన హెచ్చరించారు. ఇందులో మెట్టల సాయి దీపక్, రాచమల్ల మోహన్, కనుక్కుంట్ల వెంకటరమణ, రాచమల్లు రామ్, భరత్, రాము, చిరంజీవి, నరేష్, సోఫియా, మణిదీప్, సాయి తదితరులు పాల్గొన్నారు.
ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!