Telanganapatrika (July 09): Ellanthakunta Police, సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట ఎస్సై అశోక్ గారు యువతకు బలమైన హెచ్చరిక చేశారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలవడం వల్ల ఎంతోమంది యువకులు తమ చదువులను మధ్యలోనే వదిలేస్తూ, తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

Ellanthakunta Police పోలీస్ హెచ్చరికలు..
ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో గంజాయి సరఫరా చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
వర్షాలు కురుస్తున్న తరుణంలో రోడ్లపై గుంతలు ఏర్పడుతున్నాయని, వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని తెలిపారు. చిన్న పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వొద్దని, మైనర్ల డ్రైవింగ్‌ను నిరోధించాలన్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే ప్రమాద సమయంలో ఇన్సూరెన్స్ వర్తించదని హెచ్చరించారు.
ఇంకా, 10వ తరగతి నుంచి డిగ్రీ వరకూ చదువుతున్న విద్యార్థులు సెల్ ఫోన్ల ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్‌కి అలవాటు పడుతున్నారని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా పెట్టి, వారు చదువుపై దృష్టి సారించేలా చూడాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్లకు సరఫరా చేయాల్సిన ఇసుకను ట్రాక్టర్ల యాజమానులు తప్పుదారి పట్టిస్తున్నారని సమాచారం వచ్చిందని, వారికి వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ట్రిపుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనం నడిపిన వారిపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu