Ponguleti on Telangana Welfare 2025, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ,ఈ నెల 14వ తేదీ నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమం ద్వారా పేదలకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. అంతేకాకుండా గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన అనేక సంక్షేమ కార్యక్రమాలను తమ ఇందిరమ్మ ప్రభుత్వం కేవలం 18 నెలల్లోనే సమర్థవంతంగా అమలు చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.మేము చెప్పిన ప్రతి మాటను నిజం చేసి చూపిస్తున్నాం అని పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం,అని మంత్రి తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి మాట్లాడుతూ, పేదలందరికీ సొంత ఇళ్లు అందించే దిశగా ప్రభుత్వం కృప్త కృషి చేస్తోందని,ఈ పథకం లబ్ధిదారులు ఎవరూ నిరాశ చెందవలసిన అవసరం లేదు అని ఆయన భరోసా ఇచ్చారు.ప్రతి అర్హుడికి ఇల్లు అందే వరకు మా ప్రభుత్వ ప్రయత్నాలు ఆగవు అని మంత్రి పేర్కొన్నార.
Ponguleti on Telangana Welfare 2025:
