Telanganapatrika (July 08): Medical Officer Arrest , ఇచ్చోడ మండలంలోని టీచర్స్ కాలనీకి చెందిన ఓ యువతిని నిరంతరం వేధింపులకు గురిచేస్తున్న వ్యవహారంపై ఆదిలాబాద్ జిల్లా పోలీసులు డాక్టర్ సయ్యద్ ఆసిమ్ అనే నిందితుడిపై క్రైమ్ నంబర్ 219/2025 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

బాధితురాలి తండ్రి షేక్ అబ్దుల్ రెహమాన్ (52) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు స్పందించారు. నిందితుడు తన కుమార్తెను నాలుగు నెలలుగా ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడని పేర్కొన్నారు.
Medical Officer Arrest BNS సెక్షన్లు 74, 79 కింద కేసు నమోదు
నిందితుడి వివరాలు:
- పేరు: సయ్యద్ ఆసిమ్
- వయస్సు: 41 సంవత్సరాలు
- తండ్రి పేరు: సయ్యద్ లతీఫ్
- వృత్తి: మెడికల్ ఆఫీసర్ (RIMS, ఆదిలాబాద్)
- నివాసం: ఇంటి నం. 5-78/22, బైల్ బజార్, ఇచ్చోడ
పోలీసుల ప్రకారం:
నిందితుడు గతంలోనూ ఇలాంటి చర్యలకు పాల్పడి ఒకసారి అరెస్టయిన వ్యక్తి. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదని బాధిత కుటుంబం చెబుతోంది. నిందితుడు బహిరంగంగా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెబుతూ ఆమెను వెంబడిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ పరిస్థితులు కుటుంబ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయనీ, పెళ్లి సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయని బాధిత తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఇచ్చోడ సీఐ బండారి రాజు తెలిపిన వివరాల ప్రకారం, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.
Read More: Read Today’s E-paper News in Telugu