Telanganapatrika (July 7): Telangana Heavy Rains Alert 2025, తెలంగాణ వర్షాల ఉధృతికి మళ్లీ మోపెత్తనుంది. వాతావరణ శాఖ తాజాగా విడుదల చేసిన హెచ్చరికల ప్రకారం, జూలై 7, 8 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఏ జిల్లాల్లో వర్షాలు తీవ్రంగా ఉండే అవకాశం?
సోమవారం రోజు కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో వర్షపాతం అధికంగా ఉండే అవకాశం ఉండటంతో అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
మంగళవారం నాటికి వర్షాలు మరింత తీవ్రతకు చేరే సూచనలతో — ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ అమల్లోకి రానుంది. దీంతోపాటు జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి వంటి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశమున్నట్టు అంచనా.
Telangana Heavy Rains Alert 2025 ప్రజలకు సూచనలు
- లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- పాఠశాలలు, ఆఫీసులు అవసరమైతే క్లోజ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి
- అత్యవసర అవసరాలకే బయటకు వెళ్లాలి
- అధికారుల సూచనలు పాటించాలి
వర్షాల ప్రభావం ఈ నెల 12వ తేదీ వరకు ఉండే అవకాశం ఉండటంతో, వ్యవసాయం, రవాణా, విద్యుత్ రంగాల్లో సైతం ప్రభావం పడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు
తాజా అప్‌డేట్స్ కోసం ఇంకా www.telanganapatrika.in ను ఫాలో అవ్వండి