Telanganapatrika (July 06): Rabies vaccination, ఈ ఆపదకర వ్యాధిపై జూనోసీడ్ డే సందర్భంగా కోదాడలో అవగాహన పెంచుతూ ఉచిత టీకా క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారి డా. దాచేపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, “నివారణ తప్ప చికిత్స లేని ఈ వ్యాధి నుంచి పశుప్రాణులను కాపాడేందుకు ఒక టీకా సంవత్సరానికి చాలనివ్వండి” అని స్పష్టం చేశారు.

పెంపుడు కుక్కలు ఇప్పుడు కుటుంబాల్లో భద్రతా రక్షకుల్లా మారిన విషయం గుర్తు చేస్తూ, యజమానులు బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
పట్టణంలోని వీధికుక్కల సమస్యపై సమగ్ర వ్యూహం:
ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి పెంటయ్య మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలోని వీధికుక్కల నియంత్రణకు జంతు సంక్షేమ బోర్డ్ మార్గదర్శకాల ప్రకారం టీకాల వేయింపు, పునరావాస చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ఇది కోదాడ పట్టణంలో రేబిస్ వ్యాధిని శాశ్వతంగా అరికట్టే దిశగా కీలక ముందడుగు అని పేర్కొన్నారు.
Rabies vaccination టీకా క్యాంపులో విశేషాలు:
ఈ ఉచిత క్యాంపులో
- 93 కుక్కలకి
- 16 పిల్లులకి
- రేబిస్ నివారణ టీకాలు వేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డాక్టర్ మధు (కోదాడ), డా. సురేంద్ర (కాపుగల్లు), డా. వినయ్ (అంబులెన్స్), సిబ్బంది రాజు, చంద్రకళ, అఖిల్, కర్ణ తదితరులు పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu