Telanganapatrika (July 05) : పాశమైలారం ప్రమాదం , పాశమైలారం సిగాచీ కంపెనీలో ఇటీవల చోటుచేసుకున్న విషాద ఘటనపై ఇంకా అనేక ప్రశ్నలు మిగిలిపోయాయి. మొత్తం 39 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు ధృవీకరించినప్పటికీ, మరో 11 మంది గురించి ఇప్పటికీ స్పష్టత లేదు.

పాశమైలారం ప్రమాదం ఘోర ప్రమాదంలో ఆవిరైపోయారా?
ఆ మరణించినవారి శరీర భాగాల్లో కొంత అయినా లభిస్తుందని కుటుంబాలు ఆశించగా, వీరిలో 11 మంది గురించి మాత్రం ఒక్క చిన్న అవశేషం కూడా దొరకలేదు. ఘటనా స్థలాన్ని మరోసారి గాలించినా ఫలితం శూన్యం.
దీంతో ఈ 11 మంది మంటల్లో పూర్తిగా కాలిపోయారా? లేక మరెక్కడికైనా వెళ్లిపోయారా? అనే అనుమానాలు మిగిలిపోతున్నాయి. బాధిత కుటుంబాలు ఇంకా ఆశను వదలక పోవడం, అధికారులూ అసమాధానంగా ఉండటం తీవ్ర మనోవేదన కలిగిస్తున్నాయి.
Read More: Read Today’s E-paper News in Telugu