City Police Act : జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని, ఈరోజు జూలై 1వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు జిల్లాలో సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్న నిరసనలు, ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు తదితర కార్యక్రమాలు పోలీసు అనుమతి లేకుండా నిర్వహించకూడదని హెచ్చరించారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చర్యలు పూర్తిగా నిషేధితమని స్పష్టం చేశారు. జిల్లా ప్రజలు పోలీసులకు సహకరిస్తూ, శాంతియుత వాతావరణాన్ని కాపాడే దిశగా ముందుకు రావాలని కోరారు.
City Police Act సూచన:
పోలీసు శాఖ శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం శ్రమిస్తోందని, అన్ని వర్గాల ప్రజలు తమ సహకారం అందించాలని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu