Telanganapatrika (June 29): Hyderabad Elevated Corridor రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణా పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి అన్ని అధికారులు తెలియజేశారు.కంటోన్మెంట్ లో భూములు ఇవ్వడానికి రక్షణ శాఖ అంగీకరించడంతో తెలంగాణ ప్రభుత్వంతో రక్షణ శాఖ అధికారులు,హెచ్ఎండీఏకు మధ్య శనివారం కీలక ఒప్పందం కుదిరింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్,రక్షణ శాఖ తరపున తెలంగాణ, ఆంధ్ర సబ్ ఏరియా హెడ్ క్వార్టర్స్ లో బ్రిగేడియర్ ఎస్.రాజీవ్ సికిందరాబాద్ ప్రాంతంలో రెండు ఎలివేటెడ్ కారిడార్‌ల నిర్మాణానికి అవసరమైన ఏ1 రక్షణ భూముల బదిలీ ఒప్పంద పత్రాలు పై సంతకాలు చేశారు.
జేబీఎస్ నుంచి షామీర్ పేట్, ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రతి గా షామీర్ పేట్ లో హెచ్ఎండీఏకు ఉన్న 330 ఎకరాల భూమి భూములు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.ఈ తాజా ఒప్పందం ప్రకారం రెండు మార్గాల్లో సుమారు 156 ఎకరాల రక్షణశాఖ భూములు కారిడార్ల కోసం కేటాయించనున్నారు.ప్యారడైజ్ నుంచి శామీర్ పేట్ వరకు 114 ఎకరాలు,ప్యారడైజ్ నుంచి డెయిరీఫామ్ వరకు 42 ఎకరాల చొప్పున రక్ష ణశాఖ భూములు కోల్పోనుంది.మరోవైపు శామీర్ పేట్ రూట్లో 78 ఎకరాలు,డెయిరీఫామ్ రూట్లో 13 ఎకరాల ప్రైవేట్ భూముల సేకరణ కూడా తుదిదశకు వచ్చింది,దీంతో ఇప్పకే క్షేత్ర స్థాయి సర్వేలతో పాటు అన్ని పనులు పూర్తి కావడంతో ఎన్‌హెచ్ 44 ప్యారడైజ్ నుంచి డెయిరీఫామ్ వరకు 5.7కి.మీ.కారిడార్ టెండర్లు కూడా పూర్తయ్యాయి.

Hyderabad Elevated Corridor
ఎస్‌హెచ్ 1 జేబీఎస్ నుంచి శామీర్ పేట్ వరకు 18.10 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్ టెండర్ల ప్రక్రియను కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు అధికారులు చెప్పారు.ఈ ఒప్పందం సమావేశంలో హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ రవీందర్,రక్షణ శాఖకు చెందిన స్టేషన్ కమాండర్ బ్రిగేడియర్ ఎస్.రాజీవ్ ఎంఓయూ పై సంతకాలు చేశారు.ఎంఏయూడీ సెక్రటరీ ఇలంబర్తి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్,మేజర్ జనరల్ మిశ్రా,రిటైర్డ్ ఆర్మీ అధికారి కె.సోమశంకర్ తదితరులు పాల్గొన్నారు.
కారిడార్ పనులు వేగవంతం చేయాలి అధికారులుకు ఆదేశాలు…కలెక్టర్ దాసరి హరిచందన
ఎలివేటెడ్ కారిడార్ భూసేకరణ పనుల పురోగతిపై అధికారులతో కలెక్టర్ దాసరి హరిచందన సమీక్షా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే,కలెక్టర్ మాట్లాడుతూ ఎన్ హెచ్ 44వ జాతీయ రహదారిలో భూసేకరణ పై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. భూసేకరణలో భూ నిర్వాసితులు అందరికీ సమ న్యాయం జరిగేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు కలెక్టర్ హరి చందన ఆదేశించారు..
ఎలివేటెడ్ కారిడార్ భూ నిర్వాసితులు బ్రోకర్ నమ్మి మోసపోవద్దు…తహసిల్దార్ బిక్షపతి
ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తప్పనిసరి..సర్వేయర్ వెంకటేష్
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం సికింద్రాబాద్ ప్యారడై జంక్షన్ నుంచి బోయినపల్లి మీదుగా డైయిరీ ఫామ్ వరకు 5.7 కి.మీటర్లు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరగనున్నది. ఈ నిర్మాణానికి ఎన్ హెచ్ 44 సంబంధించి ప్యారడైజ్ బాలం రాయి నుంచి బోయినపల్లి ముస్లిం గ్రీవ్ యార్డ్ వరకు సొరంగ మార్గం 0.6 కిలోమీటర్ వరకు నిర్మాణం జరగనున్నది. భూ నిర్వాసితులకు ఏ విధంగా సహాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వ రెవెన్యూ అధికారులు తిరుమలగిరి తహశీల్దార్ బిక్షపతి, సర్వేయర్ వెంకటేష్ సంప్రదించవచ్చుఅన్ని తెలిపారు.భూ సేకరణ పరిహారం కొరకు భూ నిర్వాసితులు ఎవరు దళారులను నమ్మవద్దని అధికారు సూచించారు.ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భాగంగా బాధితులు ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లకై తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని, ప్రాజెక్టు పూర్తయ్యే లోపు ఈ సర్టిఫికెట్లు సంబంధిత బాధితులకు అందజేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు.భూ నిర్వాసితుల ఫ్యామిలీ మెంబర్స్ కు సంబంధించిన సందేశాలు లు కొరకు రెవిన్యూ అధికారులను అదనపు కలెక్టర్ ముకుంద్ రెడ్డి, సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం,సంప్రదించవచ్చని లేక స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తిరుమల గిరి తహసీల్దార్ బిక్షపతి, సర్వేయర్ వెంకటేష్ ని భూ నిర్వాసితులు సంప్రదించవచ్చని కూడా తెలిపారు. ల్యాండ్ అక్విటేషన్ యాక్ట్ 2013 ప్రకారం బోయినపల్లి చిన్న తోకట్ట సర్వే నంబర్ 270 లోబి 3 లీజ్ ల్యాండ్ లో ఉన్న 36 ప్రాపర్టీ ఉన్నట్టుగా గుర్తించినట్టు అధికారులు గుర్తించారు..వారికి కూడా పరిహారం పంపిణీలో సమ న్యాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.భూ నిర్వాసితులు ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ రెవెన్యూ అధికారులు ఎంక్వైరీ చేసిన సర్టిఫికెట్ పొందిన తర్వాత నేరుగా నష్టపరిహారం నిర్వాసితుల బ్యాంక్ ఖాతా లో ద్వారా పరిహారం జమ చేయ బడుతుంది..భూ నిర్వాసితులకు చెక్కుల రూపంలో చెల్లించరు. భూ నిర్వాసితులు దళారుల (బ్రోకర్లు)మాటలు నమ్మి మోసపో వద్దు అన్ని అధికారులు తెలియజేశారు.
ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!