Bhu bharati scheme: పేదవాడి కల నెరవేర్చాలి అన్నదే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లక్ష్యం


Bhu bharati scheme: రెవెన్యూ చట్టం దేశానికే రోల్డ్ మోడల్ పేదవాడి కల నెరవేర్చాలి అన్నదే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లక్ష్యం.

Advertisement

280 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Advertisement

bhu bharati scheme Ponguleti Srinivasa Reddy
Ponguleti Srinivasa Reddy

పేదలందరూ బాగుండాలనేదే మా ఆకాంక్ష – మంత్రి కోటిరెడ్డి వెంకటరెడ్డి.

Advertisement

ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వారు 30 రోజుల్లో ఇళ్లు కట్టుకోవాలి- జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.

రాజకీయాలకతీతంగా అర్హులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న మూడున్నర ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము. మొదటి విడత న నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు చొప్పున 22500 కోట్లు ఇస్తున్నాము. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ప్రతి సోమవారం బిల్లులు చెల్లిస్తున్నాము. రాబోయే వారం, పది రోజుల్లో పైలెట్ గ్రామాలలో గృహప్రవేశాలు చేసుకోబోతున్నాం. 400 చదరపు అడుగులు నుండి 600 చదరపు అడుగులలోపు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేలా నిర్ణయించడం జరిగింది.లబ్ధిదారులు ఎంత త్వరగా ఇల్లు పూర్తి చేసుకుంటే అంత త్వరగా బిల్లు ఇస్తాం.

పేదవాడి కల నెరవేర్చాలి అన్నదే తమ లక్ష్యం .అందుకే మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాము గతంలో కూడా తాము అధికారంలో ఉన్నప్పుడే అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చాము. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లతో పేదలకు అందించాలన్నది ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూ సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేస్తున్నాము. ఆగస్టు 15 నాటికి భూ భారతి ద్వారా భూములు ఉన్న ఆసాములకు పూర్తి స్వేచ్ఛను కల్పిస్తాం. ఈ నెల 20 నుండి ఆగస్టు 15 నాటికి ఈ సమస్యలను పరిష్కరించనున్నాము.

భూభారతి చత్తాన్ని దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో పర్యటించి అన్ని విషయాలను క్రోడీకరించి అద్భుతమైన చట్టాన్ని తయారు చేసాము.ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజున ప్రజలకు అంకితం చేశాము.భూ భారతి రెవెన్యూ సదస్సులలో అధికారులే దరఖాస్తులు రాస్తారు. భూ సమస్యల పరిష్కారానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. తాసిల్దార్, ఆర్డిఓ, కలెక్టర్ తప్పులు చేస్తే సీసీఎల్ఏ వరకు అప్పీల్ చేసుకునే అధికారం ఉంది.ధరణిలో ఇలాంటి అవకాశం లేదు దేశానికి మన రెవెన్యూ వ్యవస్థ రోల్ మోడల్ గా ఉండబోతున్నది.వచ్చే అసెంబ్లీలో ఎన్నికల్లో భూభారతి చట్టాన్ని రెఫరండంగా పెట్టుకుని వెళ్తాం పేదల కోసమే ప్రభుత్వం పని చేస్తున్నది. సాదా బై నామాలకు సంబంధించి 9 లక్షల 25 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ధరణిలో వీటి పరిష్కారానికి అవకాశం లేదు.భూ భారతిలో అలాంటి అవకాశాన్ని కల్పించాము.ఆధార్ కార్డులాగే ఆధార్ కార్డుని ఇచ్చి ఖాతా నెంబర్ ను ఇస్తున్నాము.రానున్న 30 రోజుల్లో రాష్ట్రంలో ఆరు వేల మంది లైసెన్స్ డ్ సర్వేయర్ ల ను నియమించనున్నాము.పదివేల 956 రెవిన్యూ గ్రామాలలో గ్రామ పాలన అధికారులను నియమించనున్నాము.

Bhu bharati scheme

ప్రతి డిసెంబర్ 31న జమాబంది ఏర్పాటు చేసేలా చట్టం లో పెట్టాము. రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల కోసం 18 లక్షల దరఖాస్తులు రాగా , దాదాపు 16 లక్షల50 వేల వరకు ఇందిరమ్మఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగు లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయం.ప్రతి నియోజకవర్గంలో 3500. ఇండ్లు ఇస్తున్నాం చాలా ఏళ్ళ తర్వాత ఇండ్లు వస్తున్నాయి.రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ ప్రాంతంలో కృష్ణా నదిపై మిగిలిపోయిన ప్రాజెక్టులతో లిఫ్టులను మొదలు పెట్టి పూర్తి చేస్తామని తెలిపారు. నాగార్జునసాగర్. ఎడమ కాలువ మరమ్మత్తులకు త్వరలోనే ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేస్తాం.తెలంగాణకు కృష్ణా జలాలలో తెలంగాణకు న్యాయం జరిగేలా పోరాడి తీరుతాం.మా హయాంలోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ను పూర్తి చేస్తాం..30 టీఎంసీల ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగు నిరందీస్తాం ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి, బునియాదిగాని కాలువ పనులు పూర్తిచేసి తీరుతాం.ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ లో ఇప్పటివరకు పండించని విధంగా రికార్డు స్థాయిలో వరి ధాన్యాన్ని పండించి ఖరీఫ్, రబీలలో 280 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది.వరి కొనుగోలు చెల్లింపుల లో భాగంగా 12 లక్షల మంది రైతులకు 15126 కోట్ల రూపాయలు చెల్లించాము.యాసంగి లోనే 73 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. సన్నధాన్యానికి 500. బోనస్ ఇచ్చాము.సన్న బియ్యం కింద అర్హులైన ప్రతి ఆరు కిలోల బియ్యం చొప్పున ఇస్తున్నాం. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాము.రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ….రాష్ట్రంలో ప్రతి నియోజక వర్గం వారీగా 3500 మందికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇండ్ల నిర్మాణం ఈ ప్రభుత్వంలో పేదలు బాగుండాలని ప్రతి పేదవాడికి 5 లక్షలతో ఇళ్లు కట్టిస్తున్నాం,

మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం. పెదలందరుబాగు ఉండాలనేది మా ఆకాంక్ష. గత ప్రభుత్వం కావాలనే ఎస్ఎల్బీసీ పూర్తి చేయలేదు. ధర్మారెడ్డి,పిల్లయిపల్లి అన్ని పూర్తి చేస్తాము .జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాం.జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ…ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వారు 30 రోజుల్లో ఇళ్లు కట్టుకోవాలి దశలవారీగా నిధులు మంజూరు చేస్తాము సిమెంటు ,ఇటుక ,స్టీల్ ధరల నిర్ణయానికి మండల స్థాయిలో కమిటీలు వేశాం అన్నారు.ఈ సమావేశానికి శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించి మాట్లాడుతూ పేదవాడి కళా సహకారం చేసినందుకే నిరంతరం పోరాడుతానని రాష్ట్రంలో మిర్యాలగూడ అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉండేందుకు ప్రజలు సహకరించాలని, విడతల వారీగా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ల ఇందిరమ్మ రాజ్యంలో కట్టుకొని పేదల కల సహకారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలకతీతంగా అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, గృహ నిర్మాణ శాఖ పిడి రాజకుమార్, తాసిల్దారులు ఇతర అధికారులు, రాజకీయ నాయకులు తదితరులు హాజరయ్యారు.

ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!


Advertisement

About Ganeshghani

GaneshGhani is a Chief Editor with 2.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →