TelanganaPatrika(jun 9):Sircilla,ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనంతో ఓ కుటుంబం చీకట్లో మునిగిపోయింది. తంగళ్లపల్లి మండలంలోని దేశాయిపల్లె గ్రామానికి చెందిన తుమ్మల వంశీ (వయసు: 20) ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ లో రూ.10 లక్షలకు పైగా నష్టం చవిచూసి, చివరికి ఉ*రేసుకొని ఆ*త్మహ*త్య చేసుకున్నాడు.

మూడు సంవత్సరాల నుంచి బెట్టింగ్ అలవాటు
- వంశీ ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఒక కార్ మెకానిక్ షాప్ లో పనిచేస్తున్నాడు.
- గత మూడు సంవత్సరాలుగా ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్‌కు అలవాటుపడిన వంశీ,
- తన సంపాదనతో పాటు స్నేహితుల నుంచి అప్పులు తీసుకొని గేమ్స్ లో పెట్టుబడి పెట్టి భారీగా డబ్బులు నష్టపోయాడు.
కుటుంబ సభ్యుల మందలింపుతో మనస్తాపం
- వంశీ ఆడుతున్న గేమ్స్ గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు కఠినంగా మందలించడంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
- ఈ క్రమంలో వంశీ తన పొలం వద్ద చెట్టుకు తాడితో ఉ*రేసు*కొని చ*నిపోయాడు.
Sircilla పోలీసుల స్పందన
మృ*తుడి తండ్రి తుమ్మల శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు:
తంగళ్లపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
మృ*తదేహాన్ని సిరిసిల్ల ఏరియా హాస్పిటల్ కు తరలించి పోస్టుమార్టం కోసం పంపారు.
ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామ్మోహన్ తెలిపారు.
ముఖ్య హెచ్చరిక:
ఈ సంఘటన ఆన్లైన్ బెట్టింగ్ ప్రమాదాలను తేటతెల్లం చేస్తోంది.
ఇలాంటి వ్యసనాలు యువతను మానసికంగా, ఆర్థికంగా నాశనం చేస్తున్నాయి. ప్రభుత్వం, తల్లిదండ్రులు, సమాజం సమిష్టిగా స్పందించి వీటిపై ప్రబల చైతన్యం అవసరం ఉంది.
Read More: Read Today’s E-paper News in Telugu