TELANGANA PATRIKA(JUN 6) ,ఆపదలో ఆపన్న హస్తం , సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకున్ని పరామర్శించిన దేవాలయ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు.వేములపల్లి మండల పరిధిలోని ఆమనగల్లు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేక జయరాజు ఇటీవల హార్ట్ స్ట్రోక్ రావడంతో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.

ఆపదలో ఆపన్న హస్తం సామాజిక సేవే తన మార్గం -చైర్మన్ తాళ్ళ వెంకటేశ్వర్లు
సమాచారం మేరకు టీవిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆమనగల్లు శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి బాధితుని పరామర్శించారు.అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ అధైర్యపడొద్దు కుటుంబానికి అండగా టి.వి.టీ ఫౌండేషన్ ఉంటుందని అధినేత భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో ఐఎన్టీయుసి రాష్ట్ర కార్యదర్శి బంటు చొక్కయ్య గౌడ్, తాజా మాజీ సర్పంచ్ వల్లంపట్ల ప్రవీణ్, ఉప సర్పంచ్ కోల సైదులు, మాజీ వార్డ్ నెంబర్ పెరుమాళ్ళ రమేష్,ఓబీసీ సెల్ మండల అధ్యక్షుడు కోల పెద్ద సైదులు తదితరులు పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu