Kamareddy Police : తాగి వాహనం నడిపిన కానిస్టేబుల్​ సస్పెన్షన్​..!

TELANGANA PATRIKA(JUN 6) ,Kamareddy Police , కామారెడ్డి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ విధులకు గైర్హాజరవుతున్న సిబ్బందిపై కామారెడ్డి పోలీస్ బాస్ కన్నెర్ర చేస్తున్నారు. చిన్న తప్పు చేసినా సస్పెండ్​ చేసేందుకు వెనుకాడట్లేదు. నిజాంసాగర్ పోలీస్​స్టేషన్ కానిస్టేబుల్ మోహన్ సింగ్ సస్పెన్షన్ మరువకముందే అదే పోలీస్ స్టేషన్​కు చెందిన మరో కానిస్టేబుల్​ను ఎస్పీ రాజేష్ చంద్ర సస్పెండ్ చేశారు.

Join WhatsApp Group Join Now

Kamareddy Police , కానిస్టేబుల్​ రాకేష్​ గౌడ్​ను సస్పెండ్​ చేస్తూ కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్​ చంద్ర శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.నిజాంసాగర్​ పోలీస్​స్టేషన్​లో కానిస్టేబుల్​గా పనిచేస్తున్న రాకేష్​ గౌడ్​ ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యారు. 5వ తేదీన
పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవింగ్ – ప్రమాదానికి దారి తీసింది!

డ్రంకన్​ డ్రైవ్​ టెస్ట్​ చేయగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు గుర్తించారు. ఎస్సై ఇచ్చిన నివేదిక ఆధారంగా శుక్రవారం రాకేష్​ గౌడ్​ను సస్పెండ్​ చేస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో పోలీసులు బాధ్యతారహిత ప్రవర్తన, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు

Read More: Read Today’s E-paper News in Telugu

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →