TELANGANA PATRIKA(JUN 6) , Whip Aadi Srinivas , వేములవాడ ఇందిరమ్మ ఇల్లు పథకం పేద ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా మారిందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ అర్బన్ మండలం చింతల్టన గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆయన శుక్రవారం పరిశీలించారు.

Whip Aadi Srinivas కు వెచ్చని స్వాగతం పలికిన లబ్ధిదారులు..
“ఈ పథకం ద్వారా గూడు లేని వారికి సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు తపనపడుతున్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల మంజూరు అభివృద్ధి దిశగా మహత్తర అడుగు,” అని విప్ వ్యాఖ్యానించారు.
గత పాలనలో నిర్లక్ష్యం, ప్రజా ప్రభుత్వంలో నూతన ఆశలు
గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఎన్నికల సందర్భంగా చెప్పిన విధంగా వెంటనే చర్యలు తీసుకుని ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని మళ్లీ ప్రారంభించిందని పేర్కొన్నారు.
లబ్ధిదారులు Whip Aadi Srinivas మాట్లాడుతూ ..
ఇందిరమ్మ కాలంలో మంజూరైన ఇళ్లు ఆగిపోయినవే. ఇప్పుడు మళ్లీ ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. ఇప్పటికైనా ఇంటి కల నెరవేరుతుంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారి సహకారంతో తమ సొంత గుడిసె కల నిజమవుతోంది, అని పేర్కొన్నారు.
ఇల్లు లేని వారికి ఇది నిజంగా వరం లాంటిదని, వీలైనంత తొందరగా నిర్మాణం పూర్తిచేసుకుని నూతన జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Read More: Read Today’s E-paper News in Telugu