Advertisement

Vemulawada goshala: గోశాలలోని కోడెలను పొందుట కోసం రైతులు, ప్రజలు ఆన్లైన్లో జిల్లా వెబ్సైట్ లో నమోదు చేసుకోవాలి

Telangana patrika (June 5): vemulawada goshala,  వేములవాడ శ్రీ రాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాలలోని కోడెలను పొందుట కోసం రైతులు, ప్రజలు ఆన్లైన్లో జిల్లా వెబ్సైట్ నమోదు చేసుకోవాలని, ఎమ్మార్వో ఆఫీస్, ఆర్డిఓ ఆఫీస్, మున్సిపల్ ఆఫీసులలో, మీసేవ కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన ప్రజలు, రైతులకు మాత్రమే జియో ట్యాగింగ్ కలిగి ఉన్న కోడెలను పంపిణీ చేయనున్నామని స్పష్టం చేశారు. అర్హులైన రైతులు పట్టాదారు పాస్ బుక్ ఆధార్ కార్డ్ మొదలగు సంబంధిత ధ్రువ పత్రాలతో తమ వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.జియో ట్యాగింగ్, వెబ్సైట్ లో రైతుల వివరాలు నమోదు చేయడంతో కోడెలు పక్కదారి పట్టే అవకాశం ఉండదని, భవిష్యత్తులో వాటి సంరక్షణను పరిశీలించవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. కోడెలను తీసుకువెళ్లే రైతులు వాటి సంరక్షణ బాధ్యతను సక్రమంగా పక్కాగా చూసుకోవాలని సూచించారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement
vemulawada goshala

ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!

Advertisement

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →