
TELANGANA PATRIKA(JUN 4) , తుర్కపల్లి ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ముక్కెర్ల యాదయ్య, ప్రధాన కార్యదర్శి మెతుకు సైదులు అన్నారు .బుధవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లల నమోదు కొరకై ప్రచార జాతర తుర్కపల్లి మండలానికి చేరుకుంది.
నమ్మకం రుజువు చేస్తాయి ప్రభుత్వ పాఠశాలలు..!
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ఊరు మనబడి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా మౌలిక వసతులు కల్పనకు కృషి జరుగుతుందన్నారు. ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వెంకటాచారి ,ఆడిట్ కమిటీ కన్వీనర్ రమణకర్, సభ్యులు సిద్ధులు, జిల్లా నాయకులు దర్శనం వెంకన్న ,రవి, ఉప్పలయ్య, నరేష్, రాజకుమార్, శ్రీమన్నారాయణ, రమేష్, రాములు, ఋషి ,సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు పోతరాజు జహంగీర్, కొక్కొండ లింగయ్య, తుటి వెంకటేశం, తలారి మాతయ్య, కట్కూరి వెంకటేష్, పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
