
TELANGANA PATRIKA (JUN 4) , సిరిసిల్ల లోని ప్రతిష్టాత్మక హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో శ్రీ అనంతలక్ష్మి సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జూలై 5, 6 తేదీలలో జరగనున్నాయి. ఈ వివరాలను శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం సిరిసిల్ల వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర విద్యాసాగర్ స్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం భగవాన్, ధర్మకర్త ప్రయాకర్ రావు మధుసూదన్, సుంకపల్లి మధు స్వామి లతో కలిసి మీడియాకు బుధవారం వెల్లడించారు. మయూరగిరి పీఠాధితులు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమశాస్త్ర పండితులు నమిలికొండ రమణాచార్య స్వామి చేతులమీదుగా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. 5వ తేదీ గురువారం ప్రతిష్టమూర్తులకు జలాధివాసం కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. 6 తేదీ శుక్రవారం ద్వార తోరణ పూజ, ధ్వజ కుంభ, చతుస్థానార్చన, మహా పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అనంతరం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు నిర్వహించబడతాయని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల పట్టణ భగవద్భక్తులందరూ అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై ఆర్థిక, శారీరక ,మానసిక సహాయ సహకారాలు అందించాలని భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు.
Read More: Read Today’s E-paper News in Telugu