Telangana patrika (June3 ): Khammam sand smuggling, మండలం పరిధిలోని కుర్నవల్లి గ్రామంలో జోరుగా మట్టి తోలకాలు జరుగుతున్నాయి ఆ వైపు వెళ్లి పరిశీలించిన పరిస్థితి లేక అక్రమలు జరుగుతున్నాయి. మట్టి తోలకాలకు, మైనింగ్ అధికారుల ద్వారా మైనింగ్ మరియు రెవెన్యూ అధికారులతో పర్మిషన్ తీసుకొని మట్టి తోలాల్సి ఉంది, కానీ అలాంటి చర్యలు ఎక్కడ జరగటం లేదు దీనితో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని అక్రమార్కుల జేబులోకి వెళ్తున్నాయి , ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు విప్పల్ మడక గ్రామానికి చెందిన కుర్నవల్లిలో రాత్రి , పగలు లేకుండా మట్టి తలోకాలు జరుగుతున్నాయి. దీనితో ట్రాక్టర్లు అతివేగంగా వెళ్లడంతో కొన్ని చోట్ల ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు ఒకానొక దశలో అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమలు జరుగుతున్నాయని బహిరంగంగా చర్చించుకుంటున్నారు.

Comments are closed.