
TELANGANA PATRIKA(JUN 2) , నీటి కోసం జెండా నిలిపివేత!, మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం తమ గ్రామానికి తాగునీరు ఐదు రోజులగా రావడంలేదని సోమవారం మండలంలోని హస్సాల్పూర్ గ్రామస్తులు ఆందోళన చేట్టారు. జూన్ 2 రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఎగురవేసిందుకు
వచ్చిన గ్రామ కార్యదర్శి శివశంకర్ అధికారులను అడ్డుకోన్నారు. గ్రామంలో నెలకొన్న మంచి నీటి సమస్యను పరిష్కరించిన తర్వాతే జెండాను ఎగురవేయాలని కార్యాలయం ముందు బైఠాయించి మహిళలు గ్రామస్తులు ఖాళీ బిందెలతో ధ ర్మా చేశారు.
నీటి కష్టాలతో జాతీయ జెండా నిలిపిన గ్రామస్తులు!
గ్రామంలో ఐదు రోజులుగా మంచినీటి సమస్య నెలకొన్న పట్టించుకునే కరువయ్యారని మండిపడుతూ తాగునీటి సమస్యను పరిష్కరించే వరకు జాతీయజెండాను ఎగుర వేయవద్దంటూ ముందుకేస్తూ జాతీయ జెండా ఆవిష్కరణ నుఅడ్డుకోన్నారు.గ్రామకార్యదర్శి శివశంకర్ మాజీ సర్పంచ్ మమత పాండురంగ చారిలు
గ్రామస్తులు మహిళలను సముదాయించారు . గ్రామానికి ప్రధానంగా తాగునీటి సమస్య తీర్చేందుకు హల్దీ వాగునుండి
నీరు సరఫరా చేసేందుకు 20 హెచ్ పి బోరు మోటార్ ఉండగా ఇటీవల కాలంలో నాలుగు ఐదు మార్లు రిపేర్ చేయించామని అయినప్పటికీ నడవడం లేదని తరచూ క చెడిపోవడం వల్ల కొత్త మోటారు ఏర్పాటుకు అవసరమయ్యే ఖర్చు65 వేల రూపాయలు పంచాయతీలో ఖాతాలో లేవని దీంతో నీటి ఎద్దడి ఏర్పడిందని తెలిపారు.
సమస్యను పరిష్కరించేందుకు స్థానిక ఎస్సైజ్యోతి కాంగ్రెస్ నాయకులు నరేందర్ రెడ్డి సుధాకర్ గౌడ్, మహేష్ రెడ్డి నరసింహ రెడ్డిలు అక్కడికి చేరుకొని గ్రామస్తులను మహిళలనుసముదాయించారు.తమకు తాగునీటి సమస్య తీర్చే వరకు జెండాను ఆవిష్కరించవద్దని
మొండికేయడంతో సాయంత్రంలోపు బోరు మోటారును ఏర్పాటుచేసి సమస్య తీస్తామని హామీ ఇవ్వడంతో జాతీయ జెండాను పంచాయతీ కార్యదర్శి ఆవిష్కరించారు.

Read More: Read Today’s E-paper News in Telugu
