
ఇందిరా భవన్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సందడి – కీలక నేతల హాజరు!
TELANGANA PATRIKA(JUN 2) , జగిత్యాల పట్టణం ఈ సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసి, వందనం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం ఆలపించారు. అనంతరం మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.బీ ఆర్ ఎస్ రెండు దశలు అధికారం చేపట్టినా ఆకాంక్షలు నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది.
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు మాట్లాడిన మంత్రులు …
మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం,రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్, రైతు రుణ మాఫీ, మహిళా సాధికారికత కోసం ఉచిత వడ్డీ, సన్న రకాలకు ఐదు వందలు రూపాయలు బోనస్ అందిస్తున్నామన్నారు.బీ ఆర్ ఎస్ పాలనలో దశాబ్ద కాలంగా కలగా మారిన రేషన్ కార్డు,కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రేషన్ కార్డు జారీ చేస్తున్నాం.గతంలో ఇచ్చిన దొడ్డురకం బియ్యం స్థానంలో సన్న రకాలబియ్యం అందజేస్తుండడంతో ప్రజలు పూర్తి గా సద్వినియోగం చేసుకుంటున్నారు ధరణి భూ సమస్యల సృష్టికి మూలం అయితే భూ భారతి భూ సమస్యల పరిష్కారానికి మార్గం.
గ్రామాల్లో నే ఎక్కడిక్కడ సమస్యలు పరిష్కరించేలా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తుండడం తెలంగాణ రాష్ట్ర పట్టుదలకు నిదర్శనం.ధరణి లో పొరపాట్లు జరిగితే సవరించే అవకాశం లేదు.భూ భారతి లో సమస్యలు పరిష్కరించేలా సవరణ చేపట్టే అవకాశం తో పాటు రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నాం.ఈ ఏడాది రబీ లో నాలుగు లక్షల అరవై వేల క్వింటాళ్ల వరి ధాన్యం సేకరించినం.ఎస్ ఆర్ ఎస్ పి కాల్వలో కలుపు మొక్కలు, పూడిక చేరి చివరి పొలాలకు నీరు చేరక పోవడం తో విద్యుత్ వినియోగం పెరిగి భారంగా మారింది.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ద్వారా కాలువల మరమ్మత్తు పనులు చేపట్టలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు.తక్షణమే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టేలా చర్యలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, అమలు చేసేలా చర్యలు చేపడుతామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu