Advertisement

Collector Ila Tripathi: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అన్ని ఏర్పాట్లు చేయాలి 2025.

collector ila tripathi state formation day 2025 arrangements

Telangana patrika (May 31): Collector Ila Tripathi. హైదరాబాదులోని జలవిహార్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (టీజేఎఫ్) 25 వసంతాల సంబురాల కార్యక్రమానికి శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. చందానగర్ పీజేఆర్ స్టేడియంలో పోస్టర్ ను విడుదల చేసి అనంతరం వాహనాల్లో బయలుదేరారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

Collector Ila Tripathi:

ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు ఫైళ్ల విఠల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సాగర్, ఉపాధ్యక్షులు గంట్ల రాజిరెడ్డి, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉప్పరి రమేష్ సాగర్ మాట్లాడుతూ 2001లో ఏర్పడ్డ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (టీజేఎఫ్) తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. తెలంగాణ కోసం కొట్లాడి రక్తం చిందించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం పలువురు జర్నలిస్టులు ఆత్మ బలిదానాలు చేశారని పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వ దమనకాండపై తమ కళాలతో ఎండగట్టారని తెలిపారు. జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపిన పాలకులపై తిరుగుబాటు చేశారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం 25 వసంతాల సంబురాలు జరుపుకోవడం గర్వంగా ఉందని అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమం నుంచి నేటి వరకు తెలంగాణ కోసం పోరాడుతున్న టీజేఎఫ్ ప్రస్థానం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ సలహాదారు పులి అమృత్ గౌడ్, సీనియర్ జర్నలిస్టులు కె.శ్రీనివాస్ గౌడ్, అశోక్ యాదవ్, టెంజు సలహాదారు జి.రవీందర్ రెడ్డి, ప్రెస్ క్లబ్ మాజీ ప్రధాన కార్యదర్శి పుట్ట వినయ్ కుమార్ గౌడ్, టెంజు శేరిలింగంపల్లి ప్రధాన కార్యదర్శి కె.కిషోర్, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్, టెంజు కార్యవర్గ సభ్యులు, జర్నలిస్టు నాయకులు, సీనియర్ జర్నలిస్టులు, పాల్గొన్నారు.

Advertisement

ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →