
సన్న వడ్లకు బోనస్ ప్రకటించినజిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు – రైతుల్లో ఆనందం!
TELANGANA PATRIKA(MAY29) , సన్న వడ్లకు బోనస్ .. రైతులకు వరం. అనేది ఇప్పుడు నిజంగా రైతులకు వరంలా మారింది. గత ప్రభుత్వ కాలంలో తక్కువ స్థలాల్లో పంట పండించే రైతులకు బోనస్ చెల్లింపులు లేవని సంగారెడ్డి జిల్లాలో అధికార జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుని, సన్నాళ్లకు రూ.1.72 కోట్ల రూపాయల బోనస్ మంజూరు చేసింది.
సన్న వడ్లకు బోనస్ .. రైతులకు వరం. గత మూడేళ్ల వడ్ల సేకరణ, చెల్లింపుల వివరాలు
2022–23 సీజన్
- వడ్ల సేకరణ: 78,824.660 మెట్రిక్ టన్నులు
- చెల్లింపులు: ₹129 కోట్లు
- లబ్ధిదారులు: 12,913 రైతులు
- సన్నాళ్ల బోనస్: లేదు
2023–24 సీజన్
- వడ్ల సేకరణ: 1,00,542.720 మెట్రిక్ టన్నులు
- చెల్లింపులు: ₹126 కోట్లు
- లబ్ధిదారులు: 1,476 రైతులు
2024–25 సీజన్
- వడ్ల సేకరణ: 1,21,472.080 మెట్రిక్ టన్నులు
- చెల్లింపులు: ₹237 కోట్లు
- లబ్ధిదారులు: 1,966 రైతులు
- సన్నాళ్ల బోనస్: ₹1.72 కోట్లు
ప్రభుత్వం లక్ష్యం – రైతుల సంక్షేమం
కలెక్టర్ వెల్లడి ప్రకారం, ఈసారి జిల్లాలో వడ్ల సేకరణ మాత్రమే కాకుండా చెల్లింపుల పరంగా కూడా అత్యధికం. ముఖ్యంగా సన్నాళ్లకు ప్రత్యేక బోనస్ చెల్లించడం జిల్లా చరిత్రలో మైలురాయి అని పేర్కొన్నారు. తుది చెల్లింపులు, ప్రామాణిక సేకరణ, కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ప్రభుత్వం దృఢంగా వ్యవహరిస్తుందని ఆమె తెలిపారు.
Read More: Read Today’s E-paper News in Telugu