కలెక్టర్ డాక్టర్ సత్య శారద: ప్రశాంతంగా గ్రామ పాలన అధికారి పరీక్ష…

TELANGANA PATRIKA(MAY25) , ఆదివారం నిర్వహించిన గ్రామ పాలన అధికారి (VPO) రాత పరీక్ష 2025 ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఈ విషయాన్ని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఇస్లామియా కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆమె స్వయంగా సందర్శించి, ఏర్పాట్లను సమీక్షించారు.

Advertisement

హాజరైన అభ్యర్థులు – గైర్హాజరైనవారి వివరాలు

ఈ పరీక్ష కేంద్రానికి కేటాయించబడిన 198 మంది అభ్యర్థులలో, 187 మంది హాజరు కాగా, 12 మంది గైర్హాజరయ్యారు. గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసిన వీఆర్వోలు, వీఆర్ఏలు కూడా ఈ పరీక్షను రాశారు.

Advertisement

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులతో కలిసి తనిఖీ..

పరీక్షా కేంద్రంలోని ఏర్పాట్లు, సౌకర్యాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్శనలో కలెక్టర్ వెంట ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్ ఓ విజయలక్ష్మి, కలెక్టరేట్ ఏవో సత్య ప్రసాద్, తహసీల్దార్ ఇక్బాల్, చీఫ్ సూపరింటెండెంట్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

పరీక్ష నిర్వహణ పట్ల అభినందనలు
పరీక్ష సమయానికి ప్రారంభం కావడం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడం వల్ల అధికారులు, పరీక్షా కేంద్రాల నిర్వాహకులు ప్రశంసలు అందుకున్నారు

Also Read : నిజామాబాద్: గ్రామ పంచాయతీ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు -అదనపు కలెక్టర్

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →