Food Safety: సొనాల దాబాలో భోజనంలో బొద్దింక – అధికారులు రంగంలోకి!

TELANGANA PATRIKA(MAY25) , Food Safety: ఆదిలాబాద్ జిల్లా సొనాల మండల కేంద్రంలోని ఓ దాబాలో భోజనం చేసే సమయంలో బొద్దింక కనిపించడం స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఫిర్యాదు చెయ్యగా, దీనిపై అధికారులు స్పందించారు.

హోటల్ పై Food Safety అధికారుల తనిఖీ

ఆదివారం నాడు ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్‌ను తనిఖీ చేశారు. హోటల్‌లో ఫుడ్ సేఫ్టీ, జీఎస్టీ, గ్రామ పంచాయతీ లైసెన్సులు లేకుండానే నిర్వహణ జరుగుతోందని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీధర్ వెల్లడించారు.

Advertisement

Advertisement

నోటీసులు జారీ – చర్యల హెచ్చరిక

Advertisement

ఫుడ్ సేఫ్టీ చట్టం ప్రకారం హోటల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. వారం రోజుల్లో స్పందన రాకపోతే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజలకు సూచన:
పౌష్టిక భోజనంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు తప్పనిసరి. ప్రజలు ఎక్కడైనా మలిన ఆహారం లేదా ఆరోగ్యానికి హానికరమైన పరిస్థితులు ఉంటే, వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

Also Read : Food Safety Task Force Raids: బెల్ స్వీట్స్ కారా తయారీ కేంద్రంపై ఆకస్మిక దాడులు

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →