Advertisement

తప్ప తాగి దారి తప్పిన లారీ డ్రైవర్… సిద్దిపేట లో కలకలం!

TELANGANA PATRIKA(MAY23) , సిద్దిపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం రాజీవ్ రహదారి నుండి పట్టణంలోకి ప్రవేశించిన ఒక లారీ ఒక్కసారిగా పరేషాన్ చేసింది. ఛత్తీస్ గడ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్ జే 42 జిఏ 6716 నెంబర్ గల వారి నడుపుతున్న డ్రైవర్ ఫుల్లుగా తాగి దారి తప్పి సిద్దిపేట పట్టణంలో ప్రవేశించిన తీరు అనేకులను ఆందోళనకు గురి చేసింది.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

సిద్దిపేట లో లారీ డ్రైవర్ మద్యం మత్తు ప్రభావం..

లారీ డ్రైవర్ మద్యం సేవించడంతో మంచి నిద్రలో ఉండి బారీ లోడుతో ఉన్న లారీ నడుపుకుంటూ పట్టణంలోని బిజేఆర్ చౌరస్తాలో దర్శనం ఇచ్చాడు. సమీపంలోని ట్రాఫిక్ పోలీసులు లారీ డ్రైవర్ ను మందలించడంతో తప్పు అయ్యింది అని కాళ్ళ బేరానికి వచ్చాడు. ఎట్టకేలకు ఇలాంటి ప్రమాదం జరగకపోవడం తో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సదరు లారీని పోలీసులు అక్కడినుండి తరలించారు. ఇంతగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తూ, కేసులు కడుతున్నా, జరిమాణాలు విధిస్తున్నా, జైలుకు పంపుతున్నా కూడా ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ పూర్తిస్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి అరికట్టాల్సిన అవసరం ఉంది.

Advertisement

Also Read : ఇసుక మాఫియా: కదలికలపై కన్నేసిన అధికారులు – పలుచోట్ల
ట్రాక్టర్లు పట్టివేత

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →